ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాకి ఇప్పుడు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు వస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పాజిటివ్ టాక్‍తో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఎన్టీఆర్ స్టైలీష్ లుక్, సుకుమార్ మార్క్ కథనం ఈ సినిమాకి చాలా ప్లేస్ అయ్యాయి.
ఐతే ఇటివలే సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఈ సినిమా చూసి తారక్, సుకుమార్ లను అభినందించారు. ఐతే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నాన్నకు ప్రేమతో సినిమా చూసాడట. పవన్‍కు ఈ సినిమా తెగ నచ్చేసిందట. సుకుమార్ డేరెక్షన్, ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని ముఖ్యంగా కథనం చాలా బాగుందని సుకుమార్‍కి మెసేజ్ ద్వారా తెలియజేసాడట.
తారక్ కి కూడా ప్రత్యేకంగా నా విషెస్ తెలియజేయమన్నాడట. అలాగే ఈ చిత్ర టీం కి కూడా అభినందనలు తెలిపాడు. పవర్ స్టార్ దగ్గర నుండి ప్రశంసలు రావడంతో నాన్నకు ప్రేమతో టీం ఫుల్ హ్యాపీగా ఉంది.
