Sunday, April 28, 2024
- Advertisement -

12 మంది సెల‌బ్రిటీలు…60 కెమెరాల‌..70 రోజులు..

- Advertisement -
Jr NTR Bigg Boss show Date Fixed

తెలుగు టీవీ చరిత్రను మార్చేసే మ‌రో షో సిద్ధమైపోతోంది. ఇంతవరకు తెలుగు ప్రేక్షకులు చూడని రియాలిటీ షో బిగ్ బాస్ ఈనెల 16 నుంచి ప్రారంభం కానుంది. స్టార్ మా టీవీలో టెలీకాస్ట్ అయ్యే ఈ ప్రోగ్రాంను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నాడు.

{loadmodule mod_custom,GA1}

జులై 16 నుండి స్టార్ మాటీవీలో ఈ షో ప్రసారం కాబోతోంది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని-ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం అవుతుంది. 12 మంది సెలబ్రిటీలు పాల్గొనే ఈ రియాల్టీ షో ప్రత్యేకంగా నిర్మించిన బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. అందరినీ అందులోకి పంపి లాక్ చేస్తారు. 70 రోజుల పాటు వారు అందులో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండాల్సి ఉంటుంది. వారి కదలికలను 70 కెమెరాలతో పర్యవేక్షిస్తుంటారు.
బిగ్ బాస్ షో అనౌన్స్ మెంట్ నుంచే ఎన్నెన్నో ప్రత్యేకతలకు వేదికగా నిలిచింది. మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఓ టీవీ షోకు హోస్ట్ చేయబోతున్నాడు. ఈ షో కోసం 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత భారీ సెట్ వేశారు. బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. ఏడు రోజులుగా స్టార్ మా నెట్ వర్క్ లో టెలికాస్ట్ అవుతున్న ప్రోమోలకు ఇప్పటివరకు 55 మిలియన్ల మందికి రీచ్ అయిందని అంచనా.

{loadmodule mod_custom,GA2}

దాదాపు 100 మంది ప్రముఖుల వడపోత అనంతరం 12 మందిని ఫైనల్ పోటీ దారులుగా ఎంపిక చేశారు. బిగ్ బాస్ తెలుగు వీక్షకులకు ఈ పన్నెండుమంది కావాల్సినంత వినోదం పంచుతారని షో నిర్వాహకులు అంటున్నారు.బిగ్ బాస్ షో మనకు కొత్త కాబట్టి ఈ షో ఎలా ఉంటుంది? ఏవిధంగా ఎంటర్టెన్ చేస్తుంది? అది జులై 16 తర్వాతగానీ మనకు అర్థమయ్యే పరిస్థితి లేదు.హిందీలో ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్న‌ బిగ్ బాస్ షోను తెలుగులో ఎంత‌వ‌ర‌కు పాపులారిటీ సంపాదించుకుంటుందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}WAhkOSAWuaA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -