- Advertisement -

అంతసీన్ లేదు: ఎన్టీఆర్ ది చిన్న టార్గెట్టే..!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి చిన్న టార్గెట్ నే పెట్టుకొన్నాడు. ఒకవైపు తెలుగులో పెద్ద హీరోలంతా వంద కోట్ల రూపాయలు అంటుంటే.. చిన్న ఎన్టీఆర్ మాత్రం ఆ స్థాయి కలలు కనడం లేదు.

ప్రత్యేకించి బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తర్వాత టాలీవుడ్ లో పరిస్థితులు మారిపోయాయి. ఏ పెద్ద హీరో సినిమా అయినా హిట్ అంటే.. అది కనీసం వంద కోట్ల రూపాయల స్థాయికి చేరుకోవాలనేది తప్పనిసరి అవుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన బాహుబలి ఆ స్థాయికి వెళ్లడంతో పాటు.. అంత కన్నా తక్కువ బడ్జెట్ తో రూపొందించిన శ్రీమంతుడు కూడా వందకోట్ల రూపాయల మార్కును చేరే సరికి… ఇప్పుడు పెద్ద హీరోల టార్గెట్ వంద కోట్ల రూపాయలు అయిపోయింది.

అయితే ఎన్టీఆర్ కుమాత్రం ఇప్పుడు అలాంటి అవకాశాలు ఏమీ కనపడటం లేదు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ సినిమాలు ఏవీ కలెక్షన్ల విషయంలో రికార్డులు సృష్టించిన దాఖలాలు లేవు. తన సాటి హీరోలు రికార్డులు సృష్టించేస్తున్నా ఎన్టీఆర్ కు మాత్రం అలాంటి అవకాశాలు లభించలేదు. మరి ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కు అలాంటి డ్రీమ్స్ ఏమీ లేవని సమాచారం. ఎన్టీఆర్ రాబోయే సినిమా “నాన్నకు ప్రేమతో” తో కనీసం 50 నుంచి 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తే అదే చాలన్నట్టుగా ఎన్టీఆర్ గ్యాంగ్ అంచనా వేస్తోంది. 

ఆ సినిమాతో కనీసం ఆ స్థాయికి వెళ్లినా ఆ తర్వాతి సినిమాలతో వంద కోట్ల రూపాయల టార్గెట్ ను పెట్టుకోవచ్చనేది వారి లెక్క. ముందుగా 50 కోట్ల ఫిగర్ ను రీచ్ అయితే ఆ తర్వాత వంద కోట్ల రూపాయలను టార్గెట్ గా పెట్టుకోవచ్చని భావిస్తున్నారు. అం టే స్టెప్ బై స్టెప్ మీద ఎదగడం అనమాట. మరి ఎన్టీఆర్ ఎలా ముందుకు పోతాడో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -