Saturday, May 18, 2024
- Advertisement -

`మ‌హానటి`కి నా అనుమ‌తి లేకుండా ఎలా తీస్తారు

- Advertisement -

నాగ్ అశ్విన్‌కు సావిత్రి కో స్టార్ జ‌మున చుర‌కలు

తెలుగు, క‌న్న‌డ‌, ప‌లు త‌మిళ్‌, హిందీ సినిమాల్లో మెరిసీ 1960-80 మ‌ధ్య తొలి స్టార్ హీరోయిన్‌గా సావిత్రి పేరుప్ర‌ఖ్యాత‌లు పొందారు. ఆమె న‌ట‌న‌, హావ‌భావాలు ప్రేక్ష‌కుల‌ను ఇప్ప‌టికీ మ‌ర‌చిపోలేకుండా చేస్తున్నాయి. అల‌నాటి ఆమె సుంద‌ర‌దృశ్యాన్ని ఇప్పుడు మ‌ళ్లీ మ‌న‌కు తెర‌పై తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు సినీ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జీవిత చ‌రిత్ర‌పై మ‌హాన‌టి సినిమా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి ద‌శ‌కు వ‌స్తున్న స‌మ‌యంలో చిక్కులు ఎదుర్కొనే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

సావిత్రి స‌మ‌కాలినురాలు జ‌మున. సావిత్రి, జ‌మున వీరిద్ద‌రూ ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించారు. వీరిద్ద‌రూ అప్ప‌ట్లో అక్కాచెల్లెలుగా ఉన్నారు. సావిత్రి జీవితంపై సినిమా తీయాలంటే త‌న అనుమ‌తి తీసుకోలేద‌ని.. త‌న‌ను ఏమాత్రం సంప్ర‌దించ‌లేద‌ని.. సావిత్రి గురించి త‌న‌కు అన్నీ విష‌యాలు తెలుసు అని పేర్కొన్నారు.ఆమె జీవితంలోని ప్ర‌తి కోణం.. సంఘ‌ట‌న‌లు త‌న‌కు తెలుసు అని మ‌రీ త‌న‌ను సంప్ర‌దించ‌కుండా సినిమా ఎలా తీస్తున్నారో.. ఏం తీస్తున్నారో అని చుర‌క‌లు అంటించారు. తన సొంత‌ కుటుంబసభ్యురాలిగా ఎంతో ప్రేమగా అక్కా అని పిలుచుకునే సావిత్రి గురించి తనకంటే ఎవరికి ఎక్కువ తెలియదని, కనీసం తనను సంప్రదించకుండా సినిమా ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు.

సావిత్రి ఉన్న రోజుల్లో చాలా చనువుగా వాళ్ల‌లో ఇప్పటికీ బ‌తికి ఉన్న నన్ను సంప్రదించకుండా ఆ దర్శకుడు ఎలా తీస్తున్నారో అర్థం కావడం లేదని చురక వేశారు. పైగా బాష రాని వాళ్లు సావిత్రిగా నటించడంపై కూడా ఆవిడ ఆక్షేపించారు. అయితే ఈ సినిమాలో జమున పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర‌ను శాలిని పాండే చేస్తోంది. త‌న పాత్ర గురించి తీసే సినిమాలో త‌న అనుమ‌తి నాగ అశ్విన్ అడ‌గ‌లేద‌ని చెప్పారు. దీనిపై సినిమా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఎలా స్పందించాలో చూడాలి.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. మార్చి 29వ తేదీన ఈ సినిమా విడుద‌ల చేయాల‌ని ప్లాన్‌. ఈ సినిమాలో స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కీర్తి సురేశ్ త‌ద‌త‌ర ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -