Thursday, May 2, 2024
- Advertisement -

భారీగా వెయిట్ లాస్ అయిన యంగ్ టైగ‌ర్‌

- Advertisement -

సినిమా అంటే ప్రాణాలు ప‌ణంగా పెట్టి సినిమాలు చేసే న‌టీన‌టులు మ‌న టాలీవుడ్‌లో ఉన్నారు. సినిమాల కోసం బ‌రువులు పెర‌గ‌డం.. త‌గ్గ‌డం, బాడీని మార్చుకోవ‌డం త‌దిత‌ర ప‌నులు చేస్తుంటారు. ఇప్పుడు ఈ వ‌రుస‌లో యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ వ‌చ్చి చేరాడు. తన తర్వాతి సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. సినిమాలో యంగ్ లుక్‌లో క‌నిపించ‌డానికి తన బరువు తగ్గించేసుకుంటున్నాడు.

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న సినిమా కోసం ఎన్టీఆర్ క‌ష్ట‌ప‌డుతున్నాడు. తన ఇంటిలోనే అత్యాధునిక జిమ్ ఏర్పాటు చేసుకుని మరీ వర్కవుట్స్ చేస్తూ బ‌రువు త‌గ్గ‌డానికి ప‌ని చేస్తున్నాడు.

ప్రొఫెషనల్స్ ట్రైనింగ్, డైట్, కొన్ని వారాల పాటు కఠోరమైన శిక్ష‌ణ తీసుకుంటున్నారు. వారం రోజులుగా చేస్తున్న క‌స‌ర‌త్తు ఫ‌లితంగా ఏకంగా 12 కిలోలు బ‌రువు త‌గ్గాడంట‌. 12 కిలోలు తన బ‌రువు తగ్గించేసుకుని.. మరీ యంగ్‌గా ఎన్టీఆర్ క‌నిపించ‌నున్నాడు. అంత బరువు తగ్గడమంటే ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నా సినిమా కోసం ఆ మాత్రం క‌ష్ట‌ప‌డ‌డానికి ఎన్టీఆర్ వెన‌కాడ‌డం లేదు. అయితే ఈ బ‌రువు త‌గ్గినా ఎలాంటి సమస్యలు, ప్ర‌భావాలు లేకుండా అన్ని రకాల జాగ్ర‌త్త‌లు తీసుకుని ఎన్టీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నాడు.

ఇంకా ఇది చాల‌ద‌ట‌. ఇంకా ఐదారు కిలోల బ‌రువు త‌గ్గాల‌ని ఇంకా ఎన్టీఆర్ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ మొత్తం పూర్త‌యిన త‌ర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -