Friday, May 3, 2024
- Advertisement -

టెంపర్, నా పేరు సూర్య……… ఎన్టీఆర్ జడ్జ్‌మెంట్ సూపర్బ్…. బన్నీ ఫెయిల్

- Advertisement -

నా పేరు సూర్య ఫలితం తెలిసిపోయింది. ఈ రోజు మార్నింగ్ నుంచే సినిమా ఎలా ఉందన్న విషయం సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అయింది. నా పేరు సూర్య ఫలితం ఏంటి అనే విషయంతో పాటు ఇప్పుడు మరొక విషయం కూడా చర్చనీయాంశం అవుతోంది. ఎన్టీఆర్‌కి చెప్పిన కథ ఎన్టీఆర్‌కి చెప్పిన కథ కాదు అని వక్కంతం వంశీ కవరింగ్ ఇస్తున్నాడు కానీ ఎన్టీఆర్ దగ్గర నుంచి వచ్చిన ఒక నెలలోపే అల్లు అర్జున్ దగ్గర కథ ఒకే చేయించుకున్నాడు వంశీ. నెల వ్యవధిలో బన్నీలాంటి స్టార్ హీరోకు మరో కొత్త కథ తయారు చేయడం అంటే అసాధ్యమనే చెప్పొచ్చు. సో……నా పేరు సూర్య కథకు ఎన్టీఆర్ నో చెప్పగానే బన్నీ క్యాచ్ చేశాడన్నది నిజం.

ఇక నా పేరు సూర్య సినిమా ఫ్లాప్. ఈ విషయం మొదటి షోతోనే స్పష్టమైపోయింది. అల్లు అర్జున్ యాక్టింగ్, డ్యాన్సులు, ఫైట్స్ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కథ వీక్‌గా ఉండడంతో సినిమా బోల్తా కొట్టేసింది. ఇక సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదన్న టాక్ వచ్చేసింది. దాంతో ఫిల్మ్ నగర్ జనాలందరూ కూడా ఎన్టీఆర్ జడ్జ్‌మెంట్‌ని ప్రశంసిస్తున్నారు. అలాగే బన్నీ నిర్ణయాలను తప్పు పడుతున్నారు. అన్నింటికీ మించి టెంపర్ సినిమా విషయంలో కూడా తానే డైరెక్షన్ చేయాలనుకున్నాడు వక్కంతం. అయితే ఎన్టీఆర్ మాత్రం కథ వరకూ ఒకేకానీ డైరెక్షన్ మాత్రం పూరీ జగన్నాథ్ చేస్తాడని వంశీకి చెప్పాడు. అప్పుడు పూరీ చేసిన మార్పులు, పూరీ టేకింగ్ కలిసొచ్చి సినిమా హిట్ అయింది. ఇఫ్పుడు కూడా ఎన్టీఆర్ నిర్ణయమే కరెక్ట్ అయింది. అందుకే అందరూ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్‌ని, డైరెక్టర్స్ ఎంపికను ప్రశంశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -