- Advertisement -

ఎన్టీఆర్ జిల్లా….. టిడిపి నేతలు, పచ్చ మీడియాపై చంద్రబాబు ఆగ్రహం

- Advertisement -

తన రాజకీయ జీవితం మొత్తం మీద చంద్రబాబుతో సహా ప్రత్యర్థులు ఎవ్వరూ కూడా కనీసం కౌంటర్ చేయలేని అస్త్రాన్ని మొదటిసారి అద్భుతంగా సంధించాడు జగన్. ఇలాంటి అవకాశం ఏ రాజకీయ నాయకుడికీ మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే ఉచిత హామీలతో సహా ఏ నాయకుడు ఎలాంటి హామీ ఇచ్చినా ప్రత్యర్థులు కౌంటర్ చేయడం మన దగ్గర కామన్. కానీ ఎన్టీఆర్ జిల్లా విషయంలో మాత్రం కాంగ్రెస్, జనసేన పార్టీలన్నీ సమర్థించాయి. ఇక టిడిపి నుంచి కూడా చిన్నా చితకా నేతల తాటాకు చప్పుళ్ళలాంటి విమర్శలు తప్పితే చంద్రబాబు, లోకేష్‌ల స్థాయి నేతలు మాత్రం పూర్తిగా మౌనంగా ఉన్నారు. ఇక ప్రజల నుంచి కూడా ఎన్టీఆర్ జిల్లా విషయంలో కుల, మతాలకు అతీతంగా మంచి స్పందన వచ్చిందని తెలుస్తోంది.

ఇదే విషయాన్ని పార్టీ సమన్వయ కమిటీ భేటీలో కూడా చంద్రబాబు ప్రస్తావించాడట. పైసా ఖర్చు కూడా లేని ఒక్క హామీతో జగన్ చాలా పేరు తెచ్చుకున్నాడన్న ఆవేదన బాబు మాటల్లో కనిపించిందని టిడిపి నాయకులే చెప్తున్నారు. అన్నింటికీ మించి టిడిపి నాయకులు వ్యతిరేకంగా స్పందించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒక రకంగా మేనేజ్ చేేసే టివి9, ఎబిఎన్, ఈనాడు లాంటి మీడియా సంస్థలు ఈ సారి పూర్తిగా ఫెయిల్ అయ్యాయని బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి తప్పులు జరగడం ఏంటని……ప్రత్యర్థుల అస్త్రాలను వెంటనే కౌంటర్ చేయకపోతే పూర్తిగా మునిగిపోతామని చెప్పుకొచ్చాడట చంద్రబాబు. మొదటి నుంచీ కూడా ఎన్టీఆర్‌కి భారత రత్నతో సహా ఎన్టీఆర్‌ పేరు నిలిచిపోయే స్థాయి విషయాలన్నింటిలోనూ వ్యతిరేకంగానే ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాను కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ టిడిపిలోనే ఎన్న ఎన్టీఆర్‌ని అభిమానించే నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం జగన్ నిర్ణయాన్ని అంతర్గతంగా ప్రశంశిస్తూ మాట్లాడుతుండడం గమనార్హం. ఆ రకంగా ఎన్టీఆర్ జిల్లా హామీతో ప్రత్యర్థుల మనసును కూడా జగన్ గెలుచుకున్నాడన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -