Thursday, March 28, 2024
- Advertisement -

తారక్ తప్పు చేయనన్నాడు… ఇప్పుడు చేస్తున్నాడా..?

- Advertisement -

యంగ్ టైగర్ ట్రాకే కాదు ….థాట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎవరికో దక్కిన సక్సెస్ ….తనకు సొంత మవ్వాలని వెంటపడతాడు. ఆ తరువాత భంగపడతాడు. ఇది ఎప్పటినుంచో మార్కెట్లో ఉన్నదే.

కిక్ చూసి సురేందర్ రెడ్డితో కమిటై… ఊసరవెల్లి చేశాడు. సింహాన్ని చూసి బోయపాటితో దమ్ము చూపించే ప్రయత్నం చేశాడు. అక్కడితో ఊరికోకుండా…దూకుడు చూసి బాద్ షాగా మారాడు. చివరికి గబ్బర్ సింగ్ తిక్కచూసి రామయ్యా వస్తావయ్యా అంటూ షాక్ తిన్నాడు. ఇంత జరిగాక తారకునిలో తత్వం బోధపడింది. అందుకే కాబోలు  విషయమున్న ప్రీవియస్ ఫ్లాప్ డైరెక్టర్ సుకుమార్ తో కమిటయ్యాడు. అదే నాన్నకు ప్రేమతో సినిమా .

దీంతో అంతా మన తారకుడు ఇంతకాలం చేస్తూ వచ్చిన ఆ తప్పును సరిదిద్దు కున్నాడనుకున్నారు. కాని ఆ ఆశ విజయదశమి న్యూస్ సంగతి తెలిసాక ఆవిరైపోయింది.

సక్సెస్ కొట్టిన దర్శకుడితో సినిమా చేసి ఫెయిల్ అవుతాడని పేరున్న తారక్ …ఇపుడు ద్వితియ విఘ్నం దాటిన కొరటాలతో సినిమా చేస్తున్నాడనే తెలియడంతో…. నందమూరి అభిమానుల్లో  మరోసారి టెన్షన్ మొదలైపోయింది.

మళ్ళీ గతంలో వచ్చిన ఫ్లాప్సే వస్తాయేమో అని భయపడుతున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఎంతో కష్టమైన ద్వితియ విఘ్నాన్ని సైతం దాటేసిన కొరటాల శివ…తారక్ ను వేధిస్తోన్న సెంటిమెంట్ ను కూడా పటాపంచలు చేసి ఇండస్ట్రీ హిట్ ఇస్తాడని చెబుతున్నారు.అన్నట్లు కొరటాల శివతో తారక్ చేసే సినిమా అక్టోబర్ 22 విజయదశమికి ప్రారంభం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -