Friday, May 17, 2024
- Advertisement -

శ్రుతి రెమ్యూనరేషన్ షాకింగ్ రేంజ్ కు చేరుకుందా..?!

- Advertisement -

హీరోయిన్ శ్రుతి హాసన్ రెమ్యూనరేషన్ షాకింగ్ ఫిగర్స్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే ‘శ్రీమంతుడు’ సినిమా రూపంలో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్న శ్రుతి ఇప్పుడు రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసినట్టుగా తెలుస్తోంది.

తనకు డిమాండ్ ఉన్న విషయాన్ని సొమ్ము చేసుకొంటూ ఆమె ఒక్కసారిగా పారితోషకాన్ని రెండు కోట్ల రూపాయల రేంజ్ కు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ మాత్రం ఇస్తే తప్ప తను సినిమాలకు సైన్ చేసేది లేదని శ్రుతి స్పష్టం చేసినట్టుగా సమాచారం. 

మరి ఇప్పుడు కమల్ హాసన్ తనయ ఈ మాత్రం పారితోషకాన్ని అందుకొంటుండటం వాస్తమే అయితే.. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ ఈమె దే అవుతుంది. ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా మరీ ఈ స్థాయి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే పరిస్థితి లేదు. చాలా మంది హీరోయిన్లు..  సరైన హిట్స్ లేక.. ఏదో అలా బండి లాగిస్తున్నారు. అయితే ఇప్పుడు శ్రుతికి తెలుగులో టాప్ హిట్ తో పాటు.. తమిళ, హిందీ భాషల్లో చేతి నిండా సినిమాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శ్రతి రెమ్యూనరేషన్ ను పెంచుకన్నట్టు గా తెలుస్తోంది.

మరి ఎవరైనా.. తమ డిమాండ్ ను క్యాష్ చేసుకొందామనే అనుకొంటారు. ఇప్పుడు శ్రుతి హాసన్ కూడా అలా చేయడంలో తప్పేమీ లేకపోవచ్చు. ఆమె స్థాయికి అది కరెక్టే అనుకున్నవాళ్లు కాదనకుండా.. తనకు ఆ డబ్బు ఇచ్చి హీరోయిన్ గా తీసుకొంటారు. అలా కాదనుకున్నవాళ్లు మాత్రం… శ్రుతిని భరించలేంలే అనుకొని మరొకరిని చూసుకొంటారు అంతే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -