Friday, May 10, 2024
- Advertisement -

యమ‌దొంగ‌లో మాదిరి త్రివిక్ర‌మ్ సినిమాలో యంగ్ టైగ‌ర్‌

- Advertisement -

అప్ప‌టివ‌ర‌కు బొద్దుగా ఉన్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా ‘య‌మ‌దొంగ’ సినిమాలో బ‌క్క‌చిక్కి ప్రేక్ష‌కాభిమానుల‌కు క‌నిపించాడు. ఆ త‌ర్వాత అదే కొన‌సాగిస్తూ తార‌క్ వ‌స్తున్నాడు. అయితే మ‌ళ్లీ తార‌క్ లావెక్కిపోయాడు. మునుప‌టిలా కాకున్నా ఇప్పుడు కొంచెం లావెక్కాడు. అయితే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా కోసం ఎన్టీఆర్ స‌న్న‌గా క‌నిపించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌డి డైట్ కోసం బాలీవుడ్ నుంచి ప్ర‌త్యేకంగా ఒక‌రు వ‌చ్చి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

జై ల‌వ‌కుశ సినిమాతో విభిన్న భావోద్వేగాలు ప‌లికించిన ఎన్టీఆర్ ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో ప‌ని చేస్తున్నాడు. ఈ సినిమా త్రివిక్ర‌మ్‌, ఎన్టీఆర్‌కు మంచి హిట్ నిలిచేలా రూపొందిస్తున్నారు. అయితే సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ‌డానికైనా తార‌క్ కృషి చేస్తాడు. అందులో భాగంగా త్రివిక్ర‌మ్ సినిమా కోసం ఎన్టీఆర్ ఆహారాన్ని మితంగా తీసుకుంటూ స‌న్న‌బ‌డ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. త‌న దేహాకృతిని మార్చుకోవ‌డానికి ఎన్టీఆర్ క‌ష్ట‌ప‌డుతున్నాడు.

ఈ సినిమాలో న‌యా ఎన్టీఆర్‌ని చూడ‌బోతున్నారు. దీనికోసం ఎన్టీఆర్ ప్ర‌ముఖ ఫిట్‌నెస్ ట్రైన‌ర్ లాయిడ్ స్టీవెన్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేకంగా క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. బాలీవుడ్‌లో లాయిడ్‌ చాలా ఫేమ‌స్‌. అక్క‌డి నుంచి ఎన్టీఆర్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చి ఎన్టీఆర్‌కు లాయిడ్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు. ఆహార నియ‌మాలు… చెబుతూ ఎన్టీఆర్‌ను స‌రికొత్త లుక్‌లో క‌నిపించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఎన్టీఆర్ కోసం ప్ర‌త్యేకంగా లాయిడ్ డైట్ సిద్ధం చేశాడు. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆల్క‌హాల్‌కి దూరంగా ఉంటున్నాడు. అత‌డి భోజ‌నం కూడా పూర్తిగా మారిపోయింది. నెల రోజుల పాటు ఎన్టీఆర్ డైటింగ్‌లో ఉండనున్నాడు. ఓ క్ర‌మ ప‌ద్ధ‌తిలోనే ఆహారం తీసుకోవాలి. రోజుకి మూడు గంట‌లు జిమ్‌లోనే గ‌డపాలి.. ఈ విధంగా ఎన్టీఆర్ సినిమా కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌రీ ఈ క‌ష్టం సినిమాలో క‌నిపిస్తుందో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -