Sunday, April 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ అభిమానుల‌కు పండుగే…

- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌కు పండ‌గ లాంటి శుభ వార్త‌. జైల‌వ‌కుశ సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. మొన్నటివరకు పూణెలో షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఆ షెడ్యూల్ కంప్లీట్ అయింది. దీంతో 3 పాటలు మినహా టోటల్ టాకీ పూర్తయింది. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించి ఇవాళ్టి నుంచి డబ్బింగ్ కూడా ప్రారంభించాడు ఎన్టీఆర్.

మిగిలిన 3 పాటల్లో 2 పాటల్ని విదేశాల్లో షూట్ చేయాలనేది ప్లాన్. కాకపోతే బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్.. ఫారిన్ లో షూటింగ్ పెట్టుకునే పొజిషన్ లో లేడు. పైగా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండడంతో.. విదేశాల్లో షూటింగ్ పెట్టుకునేకంటే ఇండియాలోనే పాటల షూటింగ్ కంప్లీట్ చేయాలని చిత్ర‌ యూనిట్ నిర్ణయించారు.

ఇండియాలోనే అందమైన లొకేషన్లలో 2 పాటల్ని పూర్తిచేసి, మిగిలిన ఒక్క పాటను సెట్ లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు. వినాయక చవితి కానుకగా ఎల్లుండి సాయంత్రం 5గంటల 40నిమిషాలకు లవకుమార్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఆ వెంటనే వారం గ్యాప్ లో కుశాల్ టీజర్, ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారు. సినిమాను వచ్చేనెల 21న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల‌కు పండ‌గే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -