ముస్లిం మహిళల జీవితాలను నాశనం చేస్తున్న ట్రిపుల్ తలాక్‌పై విజయం సాధించి చరిత్ర సృష్టించారు ఈ ఐదుగురు ధీర వనితలు. మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇచ్చేసి మరో మహిళను పెళ్లి చేసుకోవచ్చనే ముస్లింలలో ఉన్న ఈ విధానం వల్ల వాల్ల బ్రతులకు ఛీద్రమవుతున్నాయి. అయితే దీనిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తోటి మహిళల జీవితాలలో వెలుగులు నింపిన మహిళలగురించి తెలుసుకుందాం. అసలు వీల్లు ఎవరు….?
షయారో బానో (వయసు 36).. నలాంటి మహిళల జీవితాలను నాశనం చేస్తోన్న ట్రిపుల్ తలాక్‌పై మొట్టమొదట గళం విప్పింది షయారో బానో అనే ముస్లిం మహిళ. ఉత్తరాఖండ్ కాషిపూర్‌లోని హేమపూర్ దయాకు చెందిన మహిళ. షయారో బానో ఎంఏ సోషియాలజీ చదువు అనంతరం..పెల్లి చేసుకున్న షయారో 2015 అక్టోబర్‌లో తన పుట్టింటికి వచ్చింది. అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్త రిజ్వాన్ అహ్మద్ అక్టోబర్ 15, 2015న ఆమెకు ఓ లెటర్ లో తలాక్ తలాక్ తలాక్ అని రాసి పంపి, విడాకులు ఇచ్చాడు. అనంతరం భర్తకు దూరమైన షయారో బానో ఫిబ్రవరి 23, 2016న ట్రిపుల్ తలాక్‌కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
గుల్షాన్ పర్వీన్ (30).. ఈ ముస్లిం మహిళ ఉత్తర ప్రదేశ్‌లోని రామ్ పూర్ వాసి. ఆమె 2015లో తన పుట్టింట్లో ఉండగా, ఆమె భర్త ఆమెకు ఓ 10 రూపాయల స్టాంప్ పేపర్ అంటించిన ఓ లెటర్ పై తలాక్ తలాక్ తలాక్ అని రాసి పంపించాడు. దీంతో విస్మయం వ్యక్తం చేసిన ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఆఫ్రీన్ రెహ్మాన్ (28).. జైపూర్ వాసి అయిన ఈమె ఎంబీఏ వరకు చదువుకుంది. ఏ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా 2014లో ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లైన తర్వాత అదనపు కట్నం కోసం భర్త వేదిస్తుండటంతో పుట్టింటికి వచ్చింది. జనవరి 2016న ఆమెకు స్పీడ్ పోస్ట్ ద్వారా ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఇష్రాట్ జాహన్ (31).. ఈ ముస్లిం మహిళ ఉత్తర ప్రదేశ్‌లోని రామ్ పూర్ వాసి. ఆమె 2015లో తన పుట్టింట్లో ఉండగా, ఆమె భర్త ఆమెకు ఓ 10 రూపాయల స్టాంప్ పేపర్ అంటించిన ఓ లెటర్ పై తలాక్ తలాక్ తలాక్ అని రాసి పంపించాడు. దీంతో విస్మయం వ్యక్తం చేసిన ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఆటియా సబ్రి… ఈమె ఉత్తరప్రదేశ్‌లోని సహ్రన్‌పూర్ వాసి. ఈ కేసులో ఈమే చివరి పిటిషనర్. ఈమెకు వాజీద్ అలీతో 2012లో పెళ్లి జరిగింది. నవంబర్, 2015లో ఆయన ఒక పేపర్ పై ట్రిపుల్ తలాక్ అని రాసి పంపి, విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె న్యాయ పోరాటం చేసింది.
చివరికి వీరి న్యాయ పోరాటం ఫలించింది. ట్రిపుల్ తలాక్ చెల్లదని …దీనిపై కేంద్రం వెంటనే చట్టం చేయాలని సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వడంతో ఈ ఐదుగురు మహిళలు చరిత్రను తిరగరాశారు. లక్షలాది మంది ముస్లిం మహిలల జీవితాల్లో వెలుగు నింపారు. ఈ తీర్పు ముస్లిం మహిళలకు చరిత్రాత్మకమని తీర్పు అనంతరం బానో వ్యాఖ్యానించారు.
