బాబు వస్తే జాబు.. అనే నినాదాన్ని ఇచ్చారు తెలుగుదేశం వాలాలు. ఎన్నికల ముందు వీరు ఈ నినాదాన్ని ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. బాబును ముఖ్యమంత్రిని చేయమన్నారు.
మొత్తానికి ఆ నినాదం ఫలితాన్ని ఇచ్చింది. మరి ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? అంటే.. ఒక్కో ఉద్యోగం విలువ దాదాపు పదిలక్షల రూపాయలకు చేరిందని తెలుస్తోంది. టీచర్ వంటి భద్రత ఉన్న ఉద్యోగాలను ఒక్కోదానికి పదిలక్షల రూపాయల విలువగట్టినట్టుగా తెలుస్తోంది.
మంత్రి పీతల సుజాత ఇంటి దగ్గర దొరికిన పదిలక్షల రూపాయల డబ్బు బ్యాగుతో ఈ వ్యవహారం గురించి ఒక క్లారిటీ వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పీతల సుజాత ఇంటి దగ్గర దొరికిన డబ్బు ఎవరో మతిస్థిమితం లేని మహిళ పారేసుకొన్నది అంటూ.. తెలుగుదేశం నేతలు వాదిస్తున్నారు కానీ.. అసలు కథ మాత్రం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. ఆప్ ది రికార్డుగా కొంతమంది తెలుగుదేశం నేతలే ఈ ప్రచారం చేస్తున్నారు.
మంత్రిగారు ఉద్యోగాలను అమ్ముతున్నారని.. అందులో భాగంగా ఒక మహిళ వెళ్లి పదిలక్షల రూపాయలను చెల్లించి తమ వారికి ఉద్యోగం ఇప్పించమని కోరిందని.. ఈ వ్యవహారాన్ని మంత్రి సుజాత తండ్రి డీల్ చేయబోయాడని ఈ మొత్తం వ్యవహారాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించడం జరిగిందని.. ఈ విషయాన్ని గ్రహించి మంత్రి తండ్రి ఆ డబ్బుల బ్యాగ్ ను బయటకు పడేశాడని.. ఎవరో మతి స్థిమితం లేని మహిళ డబ్బును అక్కడికి తీసుకొచ్చినట్టుగా అక్కడున్న భద్రతా సిబ్బందికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమన్నాడని.. ఆ తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. మరి అసలు కథ ఏమిటో!
