- Advertisement -

ప్ర‌ణ‌య్ హ‌త్య‌లో సుపారీ కిల్ల‌ర్ సుభాష్ శ‌ర్మ అరెస్ట్‌..

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసులో సుపారీ తీసుకొని హత్య చేసిన బిహార్‌ వాసి శర్మను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్‌ పక్కన మాటువేసిన శర్మ, ప్రణయ్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

అమృత తండ్రి మారుతీరావు నుంచి సుపారీ తీసుకుని శర్మ ఈ హత్యకు పాల్పడ్డాడు.బీహార్‌కి చెందిన సుభాష్ శర్మ ప్రణయ్ హత్య కోసమే మిర్యాలగూడలో దిగాడు. మరో నిందితుడితో కలిసి మిర్యాలగూడలో ప్రణయ్ కదలికలపై అతను రెక్కీ నిర్వహించాడు. అదును కోసం వేచి చూసి పట్టణంలోని జ్యోతి ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ను కత్తితో నరికి హత్య చేశాడు.సుభాష్ శర్మను ప్రస్తుతం బీహార్ నుంచి నల్గొండకు తరలిస్తున్నారు.

ఈ సాయంత్రం 4.40గం.కు ప్రణయ్ హత్య కేసులోని నిందితులందరిని ఎస్పీ రంగనాథ్ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రణయ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో ఎస్పీ ప్రెస్ మీట్‌పై అందరి దృష్టి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -