Saturday, May 18, 2024
- Advertisement -

నాకు ఇన్స్‌ప్రేష‌న్ చిరు అంటున్న ఎన్టీఆర్!

- Advertisement -

సినీ ‘మా’ అవార్డ్స్‌ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి డాన్స్ హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినీ మా అవార్డ్స్ లో టెంపర్ సినిమాకి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కింది. ఈ టెంపర్ సినిమా విషయాన్నికొస్తే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

మంచి పవర్ ఫుల్ కార్యెక్టర్ లో ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించాడు. ఈ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను నాగర్జున, చిరు చేతుల మీదిగా ఎన్టీఆర్ అందుకున్నాడు. అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్ మాట్లాడుతూ… ఇప్పుడు ఎన్నేళ్లు వచ్చినా మా అందరికి ఇన్స్‌పిరేషన్ చిరంజీవి గారే అని ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ నోట చిరు మాట రావడంతో అభిమానులు ఈలలతో గోల చేసారు. ఆ తర్వాత బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ పేర్లను చెప్పాడు.

సినీ పరిశ్రమలో చాలా మంది దిగ్గజాల ఉన్న ఎన్టీఆర్ మాత్రం చిరు పేరు ఎందుకు చెప్పాడు అని కొందరు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తొలిత స్టేజీ పై ఉన్నవారికి గౌరవం ఇవ్వడం సంప్రదాయం కాబట్టి అలా ఎన్టీఆర్ అన్నారు అని అంటూన్నారు. సో ఏదేమైనా సినీ మా అవార్డ్స్ వేడుకలో ఎన్టీఆర్ నోట చిరు అనే మాట రావడం ఇప్పుడు సంచలనమైంది.

{youtube}v=zXSVm8pLbI0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -