Friday, May 10, 2024
- Advertisement -

అ..ఆ సినిమా భారీ కలెక్షన్స్!

- Advertisement -

ఈ టాప్ హీరో సినిమా హిట్ అయితే కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అదే రెంజ్ లో ఇప్పుడు అ..ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ చిత్రం 9 రోజుల్లో 24 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేకపోవడం కూడా ఈ చిత్రాన్నికి కలిసొచ్చింది. ఇక ఓవ‌ర్సీస్ లో అయితే ఈ చిత్రాన్ని ఓ రెంజ్ లో అదరిస్తున్నారు.

అ..ఆ దూకుడు చూస్తుంటే శ్రీ‌మంతుడు రికార్డులను కూడా దాటేస్తుందని అనిపిస్తుంది. త్రివిక్ర‌మ్ మ్యాజిక్ తో అ..ఆ ఓవ‌ర్సీస్ లో అద్భుతాలు చేస్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ 2 మిలియ‌న్ మార్క్ దాటేసింది అ..ఆ.. ఏకంగా 13 కోట్ల 47 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది. రెండో శుక్ర‌వారం 70 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది అ..ఆ. మరో వారం రోజుల్లో ఈ చిత్రాన్నికి  3 కోట్లు వ‌స్తాయంటున్నారు విశ్లేష‌కులు ఇప్ప‌టికే 2 మిలియ‌న్ డాల‌ర్ మార్క్ దాటేసి.. నాన్న‌కు ప్రేమ‌తో రికార్డ్ అందుకుంది అ..ఆ.

ఇక ఇప్పుడు నితిన్ సినిమా క‌న్ను మ‌హేశ్ శ్రీ‌మంతుడుపై ప‌డింది. 2.9 మిలియ‌న్ డాల‌ర్ అంటే దాదాపు 19 కోట్ల‌తో బాహుబ‌లి త‌ర్వాత రెండో స్థానంలో ఉంది శ్రీ‌మంతుడు. ఇప్పుడు ఈ అ..ఆ కలెక్షన్స్ చూస్తుంటే శ్రీమంతుడు రికార్డులను ఖచ్చితంగా దాటేస్తుందటున్నారు. ఈ రెంజ్ లో కలెక్షన్స్ వస్తాయి అని అ ఆ టీం కూడా ఊహించకపోవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -