- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 2 ఎన్నిరోజులో తెలుసా…?

- Advertisement -

గతేడాది వరుస విజయాలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్లాడు. సినిమాలతోనే కాకుండా బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షోతో ఆకట్టుకొన్నాడు. వెండితెర ప్రేక్షకులకే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరవయ్యాడు. బిగ్‌బాస్‌తో ప్రతీ ఇంటికి దగ్గరయ్యాడు. బిగ్‌బాస్ సీజన్ 2కు సంబంధించిన విషయాలు తాజాగా కొన్ని వెలుగులోకి వచ్చాయి.

‘బిగ్ బాస్ షో’కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. 70 రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ఆ ఛానల్ రేటింగ్ ను అమాంతంగా పెంచేసింది. అప్పటి నుంచి ‘బిగ్ బాస్’ సీజన్ 2 కోసం బుల్లితెర ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫస్టు సీజన్ కి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకున్న ఛానల్ వారు, సీజన్ 2కు సన్నాహాలు చేస్తున్నారట. సీజన్ 2 కి కూడా ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. సీజన్ 2 .. 100 రోజుల పాటు కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.

ఈ విధంగా చేయడం వలన టీఆర్పీ రేటింగ్స్ మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారట. ఈ షోకి సంబంధించిన కసరత్తు చివరిదశకు చేరుకుందనీ .. జూన్ నుంచి ప్రసారం చేయాలనే ఆలోచనలో నిర్వాహకులు వున్నారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -