Friday, April 26, 2024
- Advertisement -

ట్రైలర్ రివ్యూ: జాక్ పాట్

- Advertisement -

నాచియార్ అనే తమిళ చిత్రం తర్వాత మళ్ళీ జ్యోతిక పోలీస్ అవతారం ఎత్తింది. ఇప్పుడు తాజాగా ఆమె జాక్పాట్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని ఇప్పటికే తమిళం లో విడుదల చేయగా, తెలుగు వర్షన్ ని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఈ సినిమా ట్రైలర్ మంచి కామెడీ అంశాల తో అందరినీ మెప్పించే విధం గా ఉంది. ఈ సినిమా లో జ్యోతిక తో పాటుగా సీనియర్ హీరోయిన్ రేవతి కూడా పని చేశారు.

ఇద్దరూ కలిసి మంచి కామెడీ ని పండించారు. గుళేబాకావాలి, కాతాడి వంటి సినిమాలని చేసిన కళ్యాణ్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. చూడబోతే ఈ సినిమా తమిళం తో పాటు తెలుగు లో కూడా ఒకే రోజున విడుదల కానుంది.ఈ సినిమా ఆగస్టు 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని రకాల అంశాలు ఈ సినిమా ట్రైలర్ లో పొందు పరచడం తో సినిమా ట్రైలర్ కచ్చితంగా అందరినీ మెప్పించే విధం గా ఉంటుంది అనే టాక్ నడుస్తుంది.

ఈ సినిమా లో జ్యోతిక, రేవతి తో పాటు యోగి బాబు, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, ఆనంద్ రాజ్ నటించారు. సూర్య ఈ సినిమా ని 2D ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ పై ఈ సినిమా ని నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -