- Advertisement -

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంట‌ర్‌…ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌తం

- Advertisement -

జమ్మూకశ్మీర్ లో భాక‌ర ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. భ‌ద్ర‌తా ద‌ళాల‌కు, తీవ్ర వాదుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా బోన్ బజార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాన్ని చేరుకొని కూబింగ్ నిర్వ‌హించాయి. ఇదే స‌మ‌యంలో భద్రతాబలగాల అలికిడిని గుర్తించిన ఉగ్రవాదులు ఓ ఇంటి నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో భద్రతాబలగాలు ఆ ఇంట్లోకి దూసుకెళ్లాయి. కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. హతమైన ఉగ్రవాదుల వద్ద ఉన్న ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చనిపోయినవారు షోపియాన్ ప్రాంతానికే చెందిన జిన్నత్ ఉల్ ఇస్లామ్(22), మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మున్నా లాహోరీ(పాకిస్థాన్ పౌరుడు, జైషే ఉగ్రవాద సంస్థ సభ్యుడు)గా గుర్తించారు. మున్నా ఐఈడీ బాంబులు తయారు చేయడంలో నిపుణుడనీ, కశ్మీర్ లో పలు ఉగ్రదాడుల్లో పాలుపంచుకున్నాడని పోలీస్ అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -