Friday, May 9, 2025
- Advertisement -

‘మేడే’ రోజు అభిమానుల‌కు కాలా స‌ర్‌ప్రైజ్‌…

- Advertisement -

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రజనీ అల్లుడు కోలీవుడ్ హీరో ధనుష్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ బాషల్లో విడుదలైన ఈ టీజర్ నానా పటేకర్ ఎంట్రీతో ప్రారంభమైంది రికార్డుల‌ను సృష్టించింది.

కాలా.. ఏం పేర్రా ఇది’ అంటూ నానా పటేకర్ డైలాగ్ చెప్పగానే.. వర్షంలో గొడుగు పట్టుకుని రజినీ ఎంట్రీ అదిరింది. బ్లాక్ షర్ట్‌లో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని తెల్ల గెడ్డంతో రజినీ లుక్ మామూలుగా లేదు. దీని వెనుక ‘కాలా అంటే ఎవరు.. కాలుడు కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు’ అంటూ వాయిస్ ఓవర్‌తో రజినీ ఎంట్రీ సూపర్ అనే చెప్పాలి.

క్యారే.. సెట్టింగా? వీరయ్య బిడ్డనిరా ఒక్కడినే ఉన్నా. దిల్లుంటే గుంపుగా రండిరా’.. అంటూ ‘కాలా’ టీజర్‌తో దుమ్మురేపిన సూపర్ స్టార్ రజినీకాంత్ రేపు ‘మే డే’ సందర్భంగా మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. షూటింగ్ అనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తుండగా.. మే 9న ఆడియో వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

తాజాగా ఈ ప్రమోషన్స్ వర్క్స్‌లో భాగంగా రేపు (మే 1) సాయంత్రం 7 గంటలకు కాలా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత, రజినీ అల్లుడు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ‘కాలా’ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న సంతోష్ నారాయణ్ ఈ ఫస్ట్ సాంగ్‌కి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ‘కాలా’ చిత్రంలో పది లక్షల మందితో సాంగ్ రికార్డింగ్ చేసినట్లు తెలిపారు సంతోష్. ఇంతమంది వాయిస్‌తో సాంగ్‌ కంపోజ్ చేయడం నా కల అని.. ఇది ఇన్నాళ్లకు ‘కాలా’ చిత్రం ద్వారా నెరవేరిందంటూ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు సంతోష్ నారాయణ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -