Thursday, May 8, 2025
- Advertisement -

అవార్డులు అందుకున్న రజనీ.. రాజమౌళి

- Advertisement -

మన సినీ దిగ్గజాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి పద్మ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కు రాష్ట్రపతి పద్మవిభూషణ్ పురస్కరాన్ని అందుకున్నారు. ఇక మన బాహుబలి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి, నటి ప్రియాంక చోప్రా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.

ఈ ప్రదానోత్సవం అనంతరం నటి ప్రియాంక చోప్రా పద్మశ్రీ అందుకోవడం ఓ మధురమైన క్షణంగా భావిస్తున్నాను అని ట్విట్ చేశారు. ఇక రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య అయితే పట్టుదలతో నా తండ్రి ఇంత ఎత్తుకు ఎదిగారు అంటూ ట్విట్ చేసింది.

పద్మ పురస్కారాలు అందుకున్న వారిలో టెన్నీస్ స్టార్ సానియా మిర్జా, గాయకుడు ఉదిత్ నారాయణ్ కూడా ఉన్నారు. పురస్కార ప్రదానోత్సవం అనంతరం వీరంతా రాష్ట్రపతి భవన్ లో గ్రూప్ ఫొటో తీయించుకున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -