Saturday, May 18, 2024
- Advertisement -

ఇలాంటి పనులు మీరు చెయ్యకండి – కాజల్ అగర్వాల్

- Advertisement -

కెరీర్ ఆల్మోస్ట్ అయిపోతోంది అనుకున్న టైం లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి టైం సరిగ్గా కలిసి రావడం లేదు. ఒక పక్క తెలుగు సూపర్ స్టార్ లు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు లతో భారీ డిజాస్టర్ లు కొట్టేసిన ఈమె ఇప్పుడు రణ దీప్ హుడా తో కూడా హిందీ లో భారీ ప్లాప్ అందుకుంది. ఇప్పట్లో కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ ఈమెకి దక్కే ఛాన్స్ లేదు. ఒకవేళ మహేష్ – పూరీ సినిమా ఓకే అయితే ఆ సినిమాలో ఆమె హీరోయిన్ గా రావచ్చు అంటున్నారు.

ప్రస్తుతం తమిళనాడు లోని నీలగిరి జిల్లాలో కూనూర్ హిల్ స్టేషన్ లో వేమదాం సినిమా కోసం షూటింగ్ లో ఉన్న కాజల్ అక్కడ జీవా – బాబీ సింహా లతో అల్లరి చేస్తోంది. ఈ సినిమాలో ఉన్న కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం ఇక్కడ పాగా వేసారు చిత్ర బృందం. షూటింగ్ దాదాపు ఆఖరి దశ కి చేరుకుంది. సెప్టెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్న ఈ చిత్రానికి.. ప్రస్తుతం పాటలను తెరకెక్కిస్తున్నారు.

జీవా – కాజల్ లు కూనూర్ లో పాటలు పాడుకుంటున్నారన్న మాట. కూనూర్ అందాలతో పాటు తన కష్టాలను కూడా కలిపి.. కాజల్ ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పొట్టి డ్రస్సుతో బాగానే ఆకట్టుకుంటున్న ఈ భామ.. ‘భయంకరమైన అడవిలో.. పర్వత శిఖరాల్లో మేం చేస్తున్న వాటిని.. మీరు మాత్రం ట్రై చెయ్యకండి’ అంటూ అభిమానులకు ఓ సలహా కూడా ఇచ్చేసిందీ చందమామ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -