Thursday, May 16, 2024
- Advertisement -

టీమ్ ఇండియా దశ మారుస్తాడా?

- Advertisement -

భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ గా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఎన్నికయ్యాడు. ముందు నుంచీ ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేకున్నా.. రవిశాస్త్రితో ఉన్న పోటీ కారణంగా.. ఎవరు ఫైనల్ అవుతారన్నదీ ఉత్కంఠ పెంచింది. చివరగా.. భారత జట్టు కోచ్ పగ్గాలు అందుకున్న కుంబ్లేకు.. క్రికెట్ ప్రముఖులు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

కోచ్ నియామకం కోసం ఏర్పాటు చేసిన సచిన్, గంగూలీ, లక్ష్మణ్ అడ్వైజరీ కమిటీ ముందు.. కుంబ్లే ఇచ్చిన పీపీటీతో.. ఓ కోచ్ గా ఆయనకు ఉన్న విజన్ ఏంటో.. బీసీసీఐ అర్థం చేసుకుంది. చివరగా.. జట్టుకు అందించిన రికార్డులు, ఆటగాడిగా చూపించిన అంకిత భావం అన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. జట్టు ప్రధాన కోచ్ గా కుంబ్లేను నియమించించింది.

కోచ్ పదవికోసం బీసీసీఐకి మొత్తం 57 దరఖాస్తులు అందాయి. అందరి అర్హతలు, అనుభవాలను అడ్వైజరీ కమిటీ వడబోసింది. ఫైనల్ గా కుంబ్లేకు ఏడాది పాటు కోచ్ పదవి అప్పగించింది. ఈ నిర్ణయాన్ని అత్యంత పారదర్శకంగా తీసుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. రవిశాస్త్రి సామర్థ్యంపై కూడా ఎలాంటి అనుమానం లేదని.. అయితే అన్ని విషయాలు, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే.. కుంబ్లే పేరును ఫైనల్ చేశామని తెలిపింది.

ఇక.. 18 ఏళ్ల పాటు జట్టుకు స్పిన్నర్ గా సేవలందించిన కుంబ్లే.. ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టులు, వన్డేలు కలిపి 956 వికెట్లు తీసి.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసినన బౌలర్ గా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాకిస్థాన్ పై పదికి పది వికెట్లు తీసి కుంబ్లే సృష్టించిన సంచలనాన్ని.. భారత క్రికెట్ అభిమానులెవరూ మరిచిపోలేరు. కెప్టెన్ గా కూడా.. కుంబ్లే భారత జట్టుకు సేవలందించాడు.

ఆసీస్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా.. మంకీ గేట్ వివాదం వచ్చినపుడు.. ఈ సిరీస్ లో ఒక్కజట్టే క్రీడాస్ఫూర్తితో ఆడింది.. అని కుంబ్లే చేసిన ప్రకటన అప్పట్లో ప్రపంచ క్రికెట్ లో సంచలనం సృష్టించింది. ఇలా చెబుతూ పోతే.. కుంబ్లే ఘనతలు, సామర్థ్యాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాకే.. కుంబ్లేకు కోచ్ పదవిని అప్పగించింది.. బీసీసీఐ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -