Saturday, April 27, 2024
- Advertisement -

కాజల్ లవ్ స్టోరీ లో ఎన్నో ట్విస్టులు!

- Advertisement -

టాలీవుడ్ లోకి ‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. అతి కొద్ది కాలంలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటినా.. ఇప్పటికీ యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతుంది. ప్రస్తుతం ఆచార్య,ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుంది. అంతే కాదు వెంబ్ సీరీస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. గత సంవత్సరం తాను వలచిన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని కాజల్ కిచ్లూగా మారిపోయింది. 

తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి చెప్పింది. తాను మొదటిసారి కలిసినపుడు ఎవరో తెలియదు.. కాఫీ ఆఫర్ చేస్తే కలవడానికి రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత ఇద్దరం స్నేహితులం అయ్యాం. ఫ్రెండ్స్ గా ఉన్న తామిద్దరి మధ్యా ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా తనకు తెలియదని చెప్పింది.

స్నేహం పెరుగుతున్న సమయంలోనే కరోనా అడ్డం వచ్చింది.. చాలా వారాల తర్వాత తామిద్దరమూ మాస్క్ లు ధరించి, ఓ దుకాణంలో కలిశామని, అప్పుడే తమ మధ్య ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయిందని.. ఆ సమయంలో గౌతమ్ నీతో కలిసి ఏడడుగులు నడిచి, జీవితాన్ని గడపాలని ఉంది అని ఎంతో భావోద్వేగంతో చెప్పగానే, ఇంతకన్నా మంచివాడు దొరకడన్న భావానికి వచ్చేశానని.. అప్పుడే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నామని అన్నారు. నేను షూటింగ్స్ బిజీ.. తాను వ్యాపారంలో బిజీ.. అయినా మేం  తామిద్దరిపై రెండు కుటుంబాలూ శ్రద్ధ చూపాయని వ్యాఖ్యానించింది.

మాజీ సీఎం మ‌నువ‌డితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి!

ప్రేమికుల రోజు కథేంటో తెలుసా? ఫిబ్ర‌వ‌రి 14 నే ఎందుకు ?

మెగా క‌జిన్ల ఇంట‌ర్వ్యూ టీజ‌ర్ అదిరిపోయింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -