Friday, May 3, 2024
- Advertisement -

రానాతో లవ్ లో లేను.. అసలు నిజం చెప్పిన కాజల్

- Advertisement -

నేనే రాజు నేనే మంత్రి తో హీరో రానా మంచి విజయంను సొంతం చేసుకున్నారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటివలే రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. అయితే కాజల్, రానాతో ప్రేమలో వున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో నిజం లేదని హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆంగ్ల మీడియాతో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. రానాతో ప్రేమలో వున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

తామిద్దరం చాలాకాలంగా స్నేహితులమని చెప్పింది. రానా కష్టపడే వ్యక్తి అని, ‘బాహుబలి’ సినిమాతో రానాకు రావాల్సిన గుర్తింపు అతనికి వచ్చిందని కాజల్ అగర్వాల్ తెలిపింది. తనకు టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా తనకు మంచి పాత్ర దొరికితే చేస్తానని.. మంచి స్క్రిప్ట్ లభిస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది.

మరోవైపు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ బాలీవుడ్‌లో రీమేక్ కానుంది. బీటౌన్ యాక్షన్ అండ్ కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. తాజా ఈ సినిమాలో రణ్ వీర్ హీరోగా ఎంపిక కాగా.. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ ఎంపిక అయినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -