Sunday, May 19, 2024
- Advertisement -

టీడీపీ సీనియర్ నేత.. ఇప్పుడు వైసీపీలోకి..?

- Advertisement -

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. నంద్యాల ఎన్నికల్లో గెలవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటే.. అదే పార్టీకి చెందిన తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రణాళికను సిద్దం చేసుకుంటున్నారు. టీడీపీ పార్టీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి.. ఉప ఎన్నికల బరిలో దిగుతుండగా.. వైసీపీ తరపున మాజీ సీనియర్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు.

ఈ నెపథ్యంలో గత కొద్దిరోజులుగా పార్టీ మారతారు అని వార్తలు వస్తోన్న టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి త్వరలోనే వైసీపీ గూటికి వస్తారు కడప జిల్లాలో వార్తలు తెగ హాల్ చల్ చేస్తోన్నాయి. ఇటీవల ఆయన పార్టీ మారతారు అని వార్తలు వచ్చిన క్రమంలో సీఎం చంద్రబాబు రామసుబ్బారెడ్డి ని రప్పించుకొని ఎమ్మెల్సీ సీటు ఇవ్వడమే కాకుండా మండలి చైర్మన్ చేస్తాను అని హామీ ఇవ్వడంతో సుబ్బారెడ్డి వెనక్కి తగ్గారు. అయితే బాబు అనుకున్నది ..అయింది ఒకటి అన్నట్లు నంద్యాల ఉప ఎన్నికలు రావడంతో అక్కడ దాదాపు అరవై వేల ముస్లిం ఓటర్లు ఉండటంతో బాబు నంద్యాలకు చెందిన సీనియర్ మాజీ మంత్రి ఎండీ ఫరూక్ కి ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా మండలి చైర్మన్ ఇస్తాను అని హామీ ఇచ్చారు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రామసుబ్బారెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారట. దీంతో నంద్యాల ఉప ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ చేపట్టనున్న పాదయాత్రలో భాగంగా జమ్మలమడుగు.. నియోజక వర్గానికి వచ్చిన సమయంలో నంద్యాల లో శిల్పా చక్రపాణి రెడ్డి మాదిరిగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ మారాలని తన అనుచరవర్గానికి సుబ్బారెడ్డి చెప్పారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -