Sunday, May 5, 2024
- Advertisement -

కాజల్.. ఆ మందు బిళ్లలు ఎందుకోసం..?

- Advertisement -

కాజల్ అగర్వాల్.. వయసు పెరిగిన.. ఆమె అందం మాత్రం తగ్గలేదు. ఇప్పటికి వెండితెరపై ముసిముసి నవ్వులలతో అభిమానులను మురిపిస్తోంది. అందుకే ఇప్పటికే కాజల్ చేతి నిండ సినిమాలతో మంచి ఫాంలో ఉంది. ఈ మధ్య కాస్తా స్పీడ్ తగ్గినట్టు అనిపించిన తిరిగి వరసగా సినిమాల్లో కనిపిస్తూ.. యంగ్ హీరోయిన్స్ గట్టి పోటీయే ఇస్తోంది.

వాస్తవానికి కాజల్ అగర్వాల్.. సొషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఏమీ ఉండదు. తన ట్విట్టర్ ద్వారా అప్పుడప్పుడు విష్ చేస్తుంటుంది. తాజాగా అలసి సొలసి.. ఆదమరిచి నిద్ర పోవడానికి రెడీ అవుతూ గుడ్ నైట్ మేసేజ్ ఒకటి షేర్ చేసింది. ఇంటిలో ఉన్నప్పుడు కాకుండా షూటింగ్ కోసం వచ్చి హోటల్ నుంచి ఈ ఫొటో షేర్ చేసినట్టుంది. ‘రెడీ ఫర్ ద స్వీటెస్ట్ డ్రీమ్స్.. గుడ్ నైట్ మై లవ్ లీ ట్వీపుల్’ అంటూ ట్వీట్ పెట్టింది. ట్విట్టర్ ఉన్న పీపుల్ ను ఉద్దేశించి ట్వీపుల్ అంటూ పదప్రయోగం చేసిందన్న మాట. ఇదంత బానే ఉన్నా.. కాజల్ బెడ్ పక్కనే టేబుల్ పై మందు బిళ్లలు ఉన్నాయి. ఆ ట్యాబ్లెట్లు.. ఆ సరంజామా అంతా చూస్తే జ్వరం బారిన పడిందేమో అనిపించక మానదు. వాటి గురించి కాజల్ అయితే మరి ఏమీ చెప్పలేదు.

ఇక రీసెంట్ గా కాజల్ నేనే రాజు – నేనే మంత్రిలో రాధమ్మ పాత్రలో కాజల్ చాలా అందంగా.. అద్భుతంగా నటించింది. ఇదే టైంలో చేసిన అజిత్ హీరోగా చేసిన తమిళ్ సినిమా వివేకం మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఇంకా కాజల్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్ తో మెర్సల్… తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ పక్కన ఎంఎల్ ఎ (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -