Monday, May 20, 2024
- Advertisement -

ఈనెల 22 కి విచార‌ణ వాయిదా….

- Advertisement -

జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసులో సీబీఐ కోర్టుల్లో విచార‌న కొన‌సాగుతోంది. అటు సీబీఐ త‌రుపు న్యాయ‌వాదులు…ఇటు జ‌గ‌న్ త‌రుపు న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లును వినిపిస్తున్నారు. కేసు ర‌స‌వ‌త్త‌ర ఘ‌ట్టానికి చేరుకొనేలా క‌నిపిస్తోంది. అక్ర‌మాస్తుల కేసులో సీబీఐ విచార‌ణ తీరును త‌ప్పుబ‌డుతూ కోర్టులో వాదిస్తున్న జ‌గ‌న్ త‌రుపు న్యాయ‌వాదులు ఇప్పుడు ఆసక్తికరమైన ఘట్టానికి తెరలేపారు. జగన్ తరఫు నుంచి డిశ్చార్జి పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణ నుంచి తనను మినహాయించాలని.. జగన్ పిటిష‌న్‌లో కోరారు .

అక్ర‌మాస్తుల కేస‌లో ఏ1 గా జ‌గ‌న్ విచ‌ర‌ణ‌ను ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసు నుంచి తనకు విముక్తిని కలిగించాలని.. సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైనం ఆసక్తిక‌రంగా మారింది. జగన్ పై కేసులు పెట్టిన తీరు విడ్డూరం అని.. కోర్టుకు నివేదించారు జ‌గ‌న్ త‌రుపు న్యాయవాది. జ‌గ‌న్ కంపెనీలో పెట్టుబడులు ఒత్తిడి చేసి పెట్టించన‌వ‌ని.. ‘క్విడ్ ప్రో కో’ కింద జరిగినవి.. అనే సీబీఐ వాదన డొల్ల అని వాదించారు.

సీబీఐ నే స్వ‌యంగా జగన్ కంపెనీల విలువను 2,400కోట్లుగా లెక్కగట్టిందని, డెలాయిట్ సంస్థ మూడు వేల కోట్లుగా అంచనా వేసిందని.. కానీ, మరోవైపు ఈ కంపెనీ షేర్ వ్యాల్యూను జగన్ అసాధారణంగా పెంచి చూపించాడని సీబీఐ వాదిస్తోందని.. జగన్ తరపు న్యాయవాది పేర్కొన్నాడు. అసాధారణం.. అక్రమం.. అనే మాటకూ, ఇరు వర్గాల మదింపు విలువల్లో తేడాకు ఏ మాత్రం సారుప్య‌త లేదని జగన్ న్యాయవాది వాదించాడు.

జగన్ కంపెనీల్లో ఒత్తిడి చేసి పెట్టుబ‌డులు పెట్టించిన‌ట్టుగా వారెవ‌రూ చెప్ప‌లేద‌ని..అలాంట‌ప్పుడు సీబీఐ వాద‌న‌కు విలువేంట‌ని జ‌గ‌న్ న్యాయ‌వాది అన్నారు. దీనికి సంబంధించిన విచార‌ణను సీబీఐ కోర్టు ఈనెల 22 వ‌తేదీకి వాయిదా ప‌డింది. సీబీఐ కోర్టు గనుక జగన్ డిశ్చార్జి పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందిస్తే.. కేసుల‌లో ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్‌కు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. కోర్టు ఏ నిర్ణ‌యం తీసుకుంట‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -