Friday, May 17, 2024
- Advertisement -

సొమ్ము ప్ర‌జ‌ల‌ది… సోకు బాబుది అభివృద్దిని అడ్డుకుంటున్నార‌ని ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్‌పై ఏడుపెందుకు బాబుకు….

- Advertisement -

ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబునాయిడికి ప‌బ్లిసిటీ పిచ్చి పీక్ స్టేజికి వెల్లింది. ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగా బీభ‌త్స‌మైన ప‌బ్లిసిటీ స్టంట్‌కు తెర‌లేపుతున్నారు. వారం క్రిత‌మే త‌మ ప‌బ్లిసిటీ కోసం మీడియాల‌ను బ్ర‌తికిస్తున్నార‌నె వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. ఆ వార్త‌లు నిజ‌మే. తాజాగా జ‌ల‌సిరికి హార‌తి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు చేశారు. ఎక్క‌డ చూసినా పెద్ద‌యేత్తున యాడ్స్ ద‌ర్శ‌న‌మిచ్చాయి. చంద్రబాబు ఫొటోలతో కూడిన హంగామా మామూలేననుకోండి. ఈ స్థాయిలో పబ్లిసిటీ, నిజంగా జలసిరి మీద ప్రేమతోనేనా…?

వాగులు, వంకలు, ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు.. ఇలా ఒకటేమిటి, అన్ని చోట్లా చంద్రబాబు సర్కార్‌ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పలు చోట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌వ‌చ్చు అందులో త‌ప్పులేదు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షం అడ్డుపడుతోందంటు అరిగిపోయిన రికార్డులా డ‌బ్బాకొట్ట‌డం మాన‌డు.

రాజధాని అమరావతికి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అడ్డుపడ్తున్నారట. ఎవరు అడ్డుపడినా సరే అభివృద్ధి ఆగేది కాదని సెల‌విస్తుంటారు. అదే నిజమైతే, అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత మీద ఏడుపు ఎందుకట.? అదే మరి, చంద్రబాబు దుష్ట‌ రాజకీయ వ్యూహం.

కేవలం ప్రతిపక్షాన్ని విమర్శించడం కోసమే, జలసిరికి హారతి అనే కార్యక్రమాన్ని చంద్రబాబు చేపట్టారనుకోవాలి. అంతకు మించి, ఆయన ప్రసంగాల్లో ఇంకో మాటే కన్పించలేదు.. కన్పించాలని ఆశిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు . జలసిరికి హారతి పేరుతో హడావిడి చేస్తున్న చంద్రబాబు, కృష్ణా నదిపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో ఎలా నివాసం వుంటున్నారట.? అదంతే, రూల్స్‌ ఏవీ చంద్రబాబుకి

మొత్తమ్మీద, కోట్లు ఖర్చు చేసి ‘జలసిరికి హారతి’ పేరుతో పెద్ద పబ్లిసిటీ స్టంటే చేశారు చంద్రబాబు. మీడియాలో విపరీతమైన కవరేజ్‌ సంపాదించేసుకున్నారు. సొమ్ము రాష్ట్ర ఖజానాది, పబ్లిసిటీ మాత్రం చంద్రబాబుది. అదిరింద‌య్యా చంద్రం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -