కాజల్ అగర్వాల్ …హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు దాటిన ఇప్పటికి వరుస సినిమాలతో నటిస్తు ఫుల్ బిజీగా మారింది. తేజ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరో చేసిన సినిమా లక్ష్మీకల్యాణం. ఈ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచియం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోయిన్‌గా నటిస్తునే ఉంది ఈ భామ. టాలీవుడ్ స్టార్ హీరోలందరితోను సినిమాలు చేసింది. తమిళంలో కూడా తన హవాను చూపించింది కాజల్. ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఐటం సాంగ్‌లో నటించి షాకిచ్చింది.
తాజాగా కాజల్ నిర్మాతా మారలని చూస్తుందట. అయితే ఇప్పుడు కాదట. కొంతకాలం ఆగిన తరువాత నిర్మాతగా మారి సినిమాలను తీస్తుందట కాజల్. మరో అందాల భామ తమన్నాతో కలిసి సినిమాను తియ్యాలి అని ప్లాన్ చేసింది. కాని ఏమైందో తెలియదు కాని ఇద్దరు ఈ ఆలోచనను విరమించుకున్నారు. కాని కాజల్ మాత్రం తాను నిర్మాతగా మారడం ఖాయం అని అంటోంది. కాజల్ ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ హీరోగా చేస్తున్న సీత మూవీలో నటిస్తుంది. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నాడు.
- Advertisement -
నిర్మాతగా మారుతున్న కాజల్….హీరో అతనేనా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -