Saturday, April 27, 2024
- Advertisement -

రాక్షస రాజా..క్రేజీ అప్‌డేట్!

- Advertisement -

తేజ – రానా కాంబోలో సెకండ్ మూవీ రాక్షస రాజా వస్తున్న సంగతి తెలిసిందే. రానా బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ని రివీల్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఎన్నడూ చూడని క్రైమ్ వరల్డ్ ని ఎక్స్ ఫ్లోర్ చేస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్ , ఫ్యామిలీ డ్రామాగా తేజ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఫస్ట్ లుక్‌లో రానా తన భుజంపై భారీ తుపాకీని పట్టుకుని మరో భుజంపై బుల్లెట్లతో కనిపించగా విభూతి, తిలకం ధరించి, నోటిలో సిగార్‌తో వైల్డ్ గా కనిపించారు.

దీంతో కథపై అప్పుడే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం 1930 లో బ్రిటీష్ వారి కాలం కథగా రూపొందనుందని తెలుస్తోంది. తన పాత్ర కోసం ఇప్పటికే రానా డిఫరెంట్ మేకోవర్ తో సిద్దమైనట్లు టాక్.

రాక్షస రాజా తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేయడం ఖాయమని ధీమాతో ఉన్నారు తేజ. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి బ్లాక్ బాస్టర్ హిట్‌ సాధించింది. రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా ఇక రాక్షస రాజాకు సంబంధించిన నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -