Saturday, April 27, 2024
- Advertisement -

రాయల్ లుక్‌లో ‘డెవిల్’ రామ్

- Advertisement -

అభిషేక్ నామా దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప శీర్షిక కాగా కల్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. దసరా సందర్భంగా సినిమా నుండి రివీల్ చేసిన రామ్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. రాయల్ లుక్‌లో కళ్యాణ్ పోస్టర్‌ని విడుదల చేయగా లుక్ చాలా రాయల్ గా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక రీసెంట్‌గా రిలీజైన డెవిల్ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 24న సినిమా రిలీజ్ కానుంది. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక నాయర్‌, ఎల్నాజ్‌ నరౌజి పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది.

మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మాళవికా నాయర్ కనిపించనుండగా రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్‌ నరౌజి నటించారు. ఈ చిత్రానికి కథ – కథనం -మాటలు : శ్రీకాంత్‌ విస్సా అందిస్తుండగా హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -