తెలుగు ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ కాజల్ అగర్వాల్. టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. పదేళ్లు దాటినా ఈ అమ్మడి అందాలు ఇప్పటికీ నూతనంగానే ఉంటాయి. ఈ మద్యే కుటుంబసభ్యుల సమక్షంలో ప్రియుడి గౌతమ్ కిచ్లును పెళ్లాడి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ కాజల్. ముంబైలోని ఓ హోటల్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య, కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తుంది.
నూతన దంపతులు కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు తమ హనీమూన్ టైం ఫిక్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి క్రేజీ అప్ డేట్‌ని కాజల్ తన సోషల్ మీడియా ద్వారా ఇచ్చింది. పెళ్లి తర్వాత కేవలం రెండు వారాల గ్యాప్ తీసుకుని ఆ తర్వాత కాజల్ తిరిగి సినిమా షూటింగుల్లో పాల్గొంటుందని వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ యూనిట్‌తో మరో వారంలో జాయిన్ అవుతుందని, దాని తర్వాత హనీమూన్ ప్లాన్ చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. తమ పేరుతో ఉన్న పౌచ్‌లతో పాటు పాస్‌పోర్టులను పిక్ తీసి… బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం.. రెడీ టూ గో అంటూ కామెంట్ చేసింది. దీంతో వీరికి నెటిజన్స్ హ్యాపీ జర్నీ అనే కామెంట్స్ పెడుతున్నారు.

లేడీ గెటప్ లో కనిపించిన టాలీవుడ్ హీరోలు..!
గంటా.. చరిత్ర చూస్తే షాక్ అవ్వాల్సిందే మరీ…