Sunday, May 12, 2024
- Advertisement -

ఒకే రోజు రెండు రుచులు చూపిస్తున్న కాజల్

- Advertisement -

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమా పరిశ్రమ లో అగ్రగామి కథానాయిక గా రాజ్యం ఏలుతుంది. సీత అనే సినిమా పెద్దగా ఆడకపోయినా ఏ మాత్రం బెరుకు లేకుండా వరుస సినిమాలు ఒప్పుకుంటూ తిరిగి విజయ పథం లో నడవాలని కాజల్ సంకల్పించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆసక్తికర విషయం ఏంటి అంటే సాహో విడుదల వాయిదా పడటం తో ఒక్కసారి గా కాజల్ నటించిన రణరంగం విడుదల ముందుకు కదిలింది. ఈ లెక్కన ఈ సినిమా ఇప్పుడు ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కాజల్ అభిమానులకి ఆ రోజు డబుల్ ధమాకా అన్న మాట.

కాజల్ అగర్వాల్ తమిళం లో కూడా యాక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తుంది. ఆ లెక్కన కాజల్ అగర్వాల్ జయం రవి తో కలిసి చేసిన సినిమా కోమలి తమిళం లో అదే రోజున విడుదల అవుతుందట. ఆగస్టు 15 న కాజల్ ఇలా తెలుగు ప్రేక్షకులని, తమిళ ప్రేక్షకులని ఒకేలాగా రంజింపజేయనుంది అని టాక్ నడుస్తుంది. ఇంతకు ముందు వేరే హీరోయిన్ల విషయం లో ఇలా జరిగింది కానీ కాజల్ విషయం లో మాత్రం ఇదే మొదటి సారి అని చెప్పుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -