Sunday, May 5, 2024
- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ రివ్యూ

- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, నభ నటేష్ మరియు నిధి అగర్వాల్ జంటగా వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే తపన తో ఈ సినిమా చేశారు. మరో వైపు హీరో రామ్ కి కూడా ఈ సినిమా విజయం చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ఛార్మి కూడా పూరి తో కలిసి ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామి అయ్యారు. మణిశర్మ ఈ సినిమా కి సంగీతం అందించగా, ఈ సినిమా నేడు విడుదల అయింది. ఈ సినిమా సమీక్ష విషయానికి వస్తే..

కథ:
జైలు నుంచి తప్పించుకున్న క్రిమినల్, ఇస్మార్ట్ శంకర్ (రాం). అతడి కోసం సీ బీ ఐ పోలీసులు గాలిస్తూ ఉంటారు. ఒకానొక దశ లో శంకర్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అరుణ్ (సత్యదేవ్) కాల్పుల్లో మరణిస్తాడు. అయితే అరుణ్ కి కేసు కి సంబంధించి కీలక విషయాలు చాలా తెలుసు. ఆ పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు? ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగింది? ఇస్మార్ట్ శంకర్ చివరికి ఏం చేశాడు? అనేది సినిమా కథ.

నటీనటులు:
ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే రామ్ ఈ సినిమాలో విభిన్న పాత్ర పోషించాడని తెలిసిందే. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు రామ్. తన అద్భుతమైన నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారిందని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం తన ఎనర్జీ తో రామ్ పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుంది. ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్, నభ నటేష్ లకు ఈ సినిమాలో చాలా మంచి మరియు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు లభించాయి. ఇద్దరూ కూడా తమ నటనతో తమ పాత్రలకు ప్రాణం పోశారు. అంతేకాకుండా రామ్ తో ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సత్య దేవ్ కి ఈ సినిమాలో కూడా చాలా మంచి పాత్ర దక్కింది. ఎప్పటిలాగానే సత్యదేవ్ చాలా బాగా నటించాడు. ఆశిష్ విద్యార్థి తన పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. సాయాజి షిండే, గెటప్ శీను మరియు తులసి కూడా తమ నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు

సాంకేతిక వర్గం:
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి ఇది ఖచ్చితంగా ఒక కం బ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా సతమతమైన పూరి ఈ సారి అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లోనూ మనకి పూరి జగన్నాథ్ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తం తన ఆసక్తికరమైన నెరేషన్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు పూరి జగన్నాథ్. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాతో పూరి ఫామ్లోకి వచ్చేసారు. సొంత బ్యానర్ కాబట్టి పూరి జగన్నాథ్ మరియు చార్మి నిర్మాణ విలువల్లో ఎలాంటి లోటుపాట్లు రానివ్వకుండా మంచి విలువలు అందించారు. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. ఇప్పటికే మణిశర్మ స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మరోవైపు మణిశర్మ సినిమాలో అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి చాలా బాగా సెట్ అయింది. రాజ్ తోట అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి మరియు సినిమా పై మరింత ఆసక్తి కలిగించేలా చేశాయి. జునయిద్ సిద్ధికి ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
టీజర్ మరియు ట్రైలర్ తో పోలిస్తే పూరి జగన్నాథ్ ఈ సినిమాని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఒక కాంప్లెక్స్ స్టోరీని తీసుకున్నప్పటికీ పూరి జగన్నాథ్ ఆ కథని ప్రేక్షకుల్లోకి చాలా చక్కని విధంగా తీసుకువెళ్లారు. మిగతా వర్గ ప్రేక్షకులతో పోలిస్తే మాస్ సన్నివేశాలు ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఆసక్తికరంగా మొదలయ్యే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేవరకు ప్రేక్షకులలో అదే ఆసక్తిని ఉంచుతుంది. పూరి జగన్నాథ్ మార్క్ సన్నివేశాలు, రామ్ కనపరిచిన అద్భుతమైన నటన, మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. కథ కొంచెం ప్రెడిక్టబుల్ గా అనిపించినప్పటికీ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన విధానం అంతగా బోర్ కొట్టించదు. అయితే కేవలం కొన్ని వర్గాలకు చెందిన వారు మాత్రమే ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. చివరిగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పూరి జగన్నాథ్ మార్క్ ఉన్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -