Sunday, May 12, 2024
- Advertisement -

‘భారతీయుడు 2’లో హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్

- Advertisement -

హీరోయిన్ కాజల్‌ అగర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టికి వ‌రుస పెట్టి సినిమాలు చేస్తునే ఉంది.తాజాగా ఈ భామ లోక నాయ‌కుడు సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింద‌ని స‌మాచారం.కమల్‌ హాసన్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భారతీయుడు.

తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోసారి కమల్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా కావటంతో భారతీయుడు 2పై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కమల్‌కు జోడిగా కాజల్‌ అగర్వాల్ నటించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -