Tuesday, April 30, 2024
- Advertisement -

‘లగాయిత్తు’ సాంగ్ అద‌ర‌కొట్టిన చైతూ..!

- Advertisement -

అక్కినేని నాగ‌చైత‌న్య మంచి జోష్‌లో ఉన్నాడు.ఇటీవ‌లే శైలజా రెడ్డి అల్లుడు సినిమాతో హిట్ కొట్టిన చైతు త‌న త‌రువాత సినిమా స‌వ్య‌సాచి సినిమాను లైన్లో పెట్టాడు.ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌,ట్రైల‌ర్‌,సాంగ్స్‌కు సూప‌ర్ రెస్ప‌న్స్ వ‌చ్చింది.తాజాగా సినిమాలోని ఓ సాంగ్ ప్రొమోని విడుద‌ల చేశారు.సరిగ్గా పాతికేళ్ల క్రితం విడుదలైన అల్లరి అల్లుడులో నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు పాట అప్పట్లో బ్లాక్ బస్టర్. కీరవాణి హుషారైన ట్యూన్ కి రమ్య కృష్ణ స్పెషల్ క్యామియోలో నాగార్జున స్టెప్స్ ఓ రేంజ్ లో పేలాయి. ఇన్నేళ్ల తర్వాత అదే పాటను సవ్యసాచి కోసం రీమిక్స్ చేసారు కీరవాణి. ఇటీవలే రిలీజైన ఆడియోకి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా వీడియో ప్రోమో కూడా విడుదల చేసారు.

అభిమానులకు మాంచి హుషారు ఇచ్చేలా ఉన్న ఈ పాట ట్యూన్ అదే అయినప్పటికీ పదాల్లో చిత్రీకరణలో చాలా వైవిధ్యం చూపించాడు చందు మొండేటి.ఇందులో ప్రధానంగా ఆకట్టుకుంది నాగ చైతన్య స్టెప్స్. మంచి ఈజ్ తో ఆకట్టుకునేలా చేసాడు. సాధారణంగా చైతు స్టెప్స్ కిరాక్ అనిపించేలా ఉండవు. కాని ఈ పాట‌లో చైతు అదిరిపోయ్యే స్టేప్‌ల‌ను వేశాడు.శుక్రవారమే విడుదల ఉన్న నేపథ్యంలో చైతు ఫ్యాన్స్ దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -