Saturday, May 4, 2024
- Advertisement -

కండోమ్ యాడ్ కు కాజల్ నో అంది, ఆ హీరోయిన్ చేసేస్తోంది!

- Advertisement -

ఆ మధ్య బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కండోమ్ యాడ్ లో కనిపిస్తేనే చాలా మంది బుగ్గలు నొక్కుకొన్నారు. ఇదేంటి బాబూ.. నీకు ఇదేం పోయే కాలం అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి మేల్ డ్యామినేషన్ సొసైటీ ఒక బాలీవుడ్ హీరో కండోమ్ యాడ్ లో కనిపిస్తేనే చాలా మంది అలా స్పందించారు. మరి ఇప్పుడు ఇలియానాను చూసి అలాంటి వారు ఇంకెంత ఆశ్చర్యపోతారో!

  

ఎందుకంటే.. ఇలియానా ఇప్పుడు ఒక కండోమ్ యాడ్ కు ఓకే చెప్పింది. అందులో నటించడానికి రెడీ అయ్యింది. మరి తెలుగులో ఒకానొక దశలో టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యి.. బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు కలిగిన ఈ గోవా భామ ఇప్పుడు కండోమ్ యాడ్ లో కనిపించడానికి మించిన సంచలనం ఏముంది! 

ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. మొదటగా ఈ యాడ్ మేకర్లు కాజల్ ను పలకరించారట. ఇందులో నటించమని ఆమెను కోరారట. అయితే కాజల్ అందుకు సమ్మతించలేదని సమాచారం. కోట్ల రూపాయలను ఆఫర్ చేసినా ఆమె కాదందని తెలుస్తోంది. అయితే ఇలియానా మాత్రం ఏ సంకోచం లేకుండా యాడ్ చేయడానికి ఒప్పుకొంది. భారీ మొత్తం డబ్బు వచ్చే అవకాశం ఉండటంతో ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటున్నట్టుగానే తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -