హిట్టు సినిమా కోసం ఆస్తులు అమ్మి సినిమాలు తీస్తున్న ఓ ప్రొడ్యూసర్ మ్యూజిక్ కోసం ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కి భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చారట..
అయితే ఇచ్చేముందు, నువ్వు ముందు ఏ సినిమా చేశావని అడిగితే, పలాన సంస్థలో చేస్తున్నా అని ఇటు చెప్పి… ఈ సంస్థలో చేస్తున్నా అని ఆ సంస్థలో చెప్పి… రెండు భారీ రెమ్యూనరేషన్ సినిమాలు పట్టుకున్నాడు. అయితే అక్కడ వచ్చింది అసలు కిక్కు.. కాదు కాదు చిక్కు..
ఇద్దరూ నమ్మారు, రెమ్యూనరేషన్ ఇచ్చారు, సినిమాలు ప్రారంభమయ్యాయి, సాంగ్స్ రికార్డింగ్ అయ్యాయి, మూవీస్ కూడ రిలీజ్ అయ్యాయి కాని రెండు ఫట్‌మన్నాయి. పోగా ఒక్క సాంగ్ కూడ ఎక్కడ వినిపించలేదు దాంతో చిర్రెత్తిన ఆ ప్రొడ్యూసర్ ఇంకో సినిమా చేస్తున్నారా.. అంటూ ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ని ఆఫీస్‌కి పిలిచి మరీ స్పెషల్ దరువు పెట్టాడట.. కింగ్‌లో నాగార్జున స్టైల్‌లో.. ఈ విషయం తెలిసిన మరో ప్రొడ్యూసర్ ఊరుకుంటారా.. అతను కూడ డిజిటల్ DTS డాల్బీ మిక్స్ చేసి మరీ వీపు విమానం మోత మోగించాడట.. ఇదంత సరేగాని ట్యూన్స్ సెలెక్ట్ చేసుకునేది డైరెక్టర్ కదా.. మరి మ్యూజిక్ డైరెక్టర్‌ని ఎందుకు కొట్టారో… అసలు తప్పు ఎవరిదో..!?