Sunday, May 26, 2024
- Advertisement -

గ్లామర్ డోస్ పెంచిన కాజల్

- Advertisement -

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప‌ది సంవ‌త్స‌రాల క్రితం తేజ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి కళ్యాణ్ రామ్ హీరోగా ల‌క్ష్మీకాల్యాణం చిత్రంతో ప‌రిచ‌య‌మైంది.ఈ ప‌ది సంవ‌త్స‌రాల కాలంలో ఆమె స్టార్ హీరోల పక్క‌న హీరోయిన్‌గా చేసింది.తెలుగుతో పాటు త‌మిళ‌, బాలీవుడ్ చిత్రాలు కుడా చేసింది. కాని ఒక్క‌టి కుడా గుర్తుండిపోయే పాత్ర చేయ‌లేదు ఈ భామ‌. అవాకాశాలు లేవు అనుకున్న‌ప్పుడు ఏదో సినిమా అవ‌కాశం రావ‌డం అలా అలా బండి లాగించేసింది కాజ‌ల్‌.

ప్ర‌స్త‌తం కాజల్ చేతిలో ‘క్వీన్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో పాటు ఆమె కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రంలో ఆమె ఒక ఎన్నారైగా, బిలీనియర్ కుమార్తెగా కనిపించనుందట. అంతేగాక ఆమె పాత్రలో మంచి గ్లామర్ డోస్ కూడా ఉంటుందని అంటున్నారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -