Friday, May 3, 2024
- Advertisement -

బెల్ట్ షాపుల పై జగన్ ప్రశ్నిస్తే టిడిపికి ఎటకారం….. నువ్వు ప్రశ్నిస్తావా పవన్?

- Advertisement -

పవన్ కళ్యాణ్ తన షూటింగ్ గ్యాప్‌లో ఓ మూడు రోజుల పాటు సినిమాలను మించిన అభినయంతో షో చేశాడు. సినిమాల్లో కూడా పవన్ ఆ స్తాయిలో ఎప్పుడూ యాక్ట్ చేయలేదు కానీ ప్రజల ముందు అంతకుమించి అనే స్థాయిలో నటన చూపించాడు. ఆవేశరసం, కరుణ రసం……ఇంకా బోలెడన్ని డ్రమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవరసాలనూ పండించాడు. చంద్రబాబుకు సాయం చేయడానికి చాలానే దిగజారాడు పవన్. అదే సందర్భంలో ‘అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తా అనడం కరెక్ట్ కాదు……ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రశ్నించాలి, పోరాటం చేయాలి’ అని జగన్‌కి బోలెడన్ని సూక్తులు చెప్పాడు. కొంపతీసి ఉద్ధానం సమస్య తీరిపోయింది…..ఇప్పుడక్కడ కిడ్నీ బాధితులే లేరు అన్న భ్రమల్లో పవన్ ఉన్నాడేమో తెలియదు. అలాగే రాజధాని భూ సేకరణ బాధితులంతా సంతోషంగా ఉన్నారన్న చంద్రబాబు మాటలను నమ్మేశాడేమో తెలియదు. పవన్ ప్రశ్నించిన వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్టుగా చంద్రబాబు ఓ ప్రకటన చేయడం…ఆ వెంటనే పవన్ థ్యాంక్స్ చెప్పడం……ఈ మొత్తం డ్రామాని ఎల్లో మీడియా హైలైట్ చేస్తూ బాబు, పవన్‌లను ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తులుగా చూపిస్తూ ప్రజల చెవుల్లో క్యాలీఫ్లవర్స్ చెప్పడం. ఇక ఈ డ్రామాకు తోడు బాబు, పవన్‌లిద్దరూ కూడా విదేశాల్లో స్పాన్సర్డ్ అవార్డ్స్ తెచ్చుకోవడం ……చూశారా మేం చేసిన ప్రజాసేవకు గుర్తింపు అని డప్పాలు కొట్టడం……కానీ ప్రజా క్షేత్రంలోకి వెళ్ళి పరిశీలిస్తే ఉద్ధానం సమస్య అంతే తీవ్రంగా ఈ రోజుటికీ ఉంది. ప్రభుత్వం మాటలు ఆచరణలోకి రాలేదు. అలాగే భూ సేకరణ బాధితులు కూడా ఏం చేయాలో తెలియక దిగాలుపడిపోయారు.

ఆ విషయాలు పక్కన పెడితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటూ ఉంది. మహిళలు ఈ సమస్యపై పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో ఒక మహిళ కూడా చనిపోయింది. బెల్ట్ షాపులను ఎత్తేస్తా…… మద్యం మహమ్మారి నుంచి ప్రజలను రక్షిస్తా…… నా రెండో సంతకం ఆ ఫైలుపైనే ఉంటుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మద్యం అమ్మకాలను సమైక్యాంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ స్థాయిలో చేస్తున్నాడు. సమైక్యాంధ్రప్రదేశ్ ఉన్నప్పటికంటే ఇప్పటి ఆంద్రప్రదేశ్‌లో ఎక్కువ ఆదాయం మద్యం అమ్మకాలపై వస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వమే ఘనంగా ప్రకటించుకుంది. దూసుకెళ్ళిపోతున్నామని చెప్పుకుంది. మద్యాని అమ్మకాలకు సంబంధించిన ఉద్యోగులు అద్భుతంగా పనిచేస్తున్నారని ఆ మధ్య చంద్రబాబు కితాబులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఆ మధ్యం మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబుకు లేఖ రాశాడు. నిలదీశాడు. మద్యం అమ్మకాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడానికి సిగ్గుపడాలన్నాడు.సారాయి పుణ్యమాని అసువులు బాస్తున్న వాళ్ళ గురించి, రోడ్డున పడుతున్న కుటుంబాల గురించి ప్రశ్నిస్తున్నాడు పవన్. కానీ ప్రభుత్వం మాత్రం జగన్‌పై వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తోంది. కనీసం మద్యం అమ్మకాలను మేం పెంచడం లేదు అని చెప్పే ధైర్యం కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది.

ఇప్పుడిక జగన్ ఏం చేయాలి? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి. ప్రజా ఉద్యమం నిర్మించాలన్నా కూడా ప్రభుత్వం ఆ నాలుగేళ్ళలో ఎన్నో సార్లు 144 సెక్షన్ విధించి అణచివేస్తోంది. ఇక జగన్ పిలిస్తే ప్రజలెవ్వరూ రోడ్డెక్కవద్దని ఆ మధ్య పవన్ ఓ సారి బహిరంగ సభలో మాట్లాడేశాడు. అందుకే జగన్ అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. మరి పవన్ ఏం చేస్తున్నట్టు? మూడు రోజుల షో చేస్తే ప్రజా సమస్యలు తీరవన్న విషయం పనవ్‌కి తెలియదా? చంద్రబాబు తప్పుడు హామీలకు నేను కూడా బాధ్యుడిని అని చెప్పే పవన్ ఇప్పుడు ఈ మద్య నియంత్రణపై రెండో సంతకం అన్న హామీపై ఏం చెప్తాడు? గోదావరి జిల్లాల్లోనే మద్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళలకు ఏం చెప్తాడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -