Monday, May 27, 2024
- Advertisement -

బికినీ లో కాజల్ ? ఒద్దు అంటోంది

- Advertisement -

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు చేసిన సినిమాలను గమనిస్తే పెద్దగా ఎక్స్ పోజింగ్ చేసిన సినిమాలు తక్కువే అని చెప్పొచ్చు. అందునా అమ్మడు చేసిన కొన్ని ముద్దు సీన్లు కూడా కెమరా జిమ్మిక్కులే అని చెప్పేవారు ఎక్కువ. కానీ ఇప్పటివరకు పెద్దగా గీత దాటని అమ్మడికి ఈ మధ్యనే మన డైరెక్టర్ ఒకరు లేడి ఓరియె౦టెడ్ సినిమాను ఆఫర్ చేశారు.

సినిమా స్టోరీ మొత్తం చెప్పగా సూపర్ గా ఉందని నేను చేస్తానని చెప్పి సినిమాకు సైన్ చేయబోయే సమయంలో దర్శకుడు సినిమాలో ఓ సీన్ లో టూ పీస్ బికినీలో రెచ్చిపోవాల్సి వస్తుందని అది కీలకమైన సీన్ అని చెప్పాడట. ఆ మాట విన్న వెంటనే నేను ఈ సినిమా చేయను అని చెప్పి అక్కడి నుండి జారుకుందట అమ్మడు.

ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా… క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, త్వరలో మొదలు కాబోతున్న ఈ సినిమాలో కాజల్ ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వగా తరువాత ఆమె ప్లేస్ లో రెజీనాని సెలెక్ట్ చేశారట. అమ్మడు ఎలాంటి ఎక్స్ పోజింగ్ కి అయినా రెడీ అనడంతో కాజల్ ఆఫర్ ని ఆమె చేతిలో పెట్టాడట కృష్ణవంశీ. దాంతో ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -