Thursday, May 9, 2024
- Advertisement -

కల్కి రిలీజ్‌ డేట్ ఫిక్స్!

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898ఏడీ. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,దిశా పటాని, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్‌పై కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతుండగా దీనిపై ఎట్టకేలకు మేకర్స్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్ 27న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి జూలై రెండో వారంలో రిలీజ్ చేయాలని భావించిన అనేక తర్జనభర్జనల అనంతరం జూన్ 27 తేదిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోండగా దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో అశ్వినిదత్ ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. కల్కిలో విలన్‌గా కమల్ హాసన్ నటించగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -