Thursday, May 9, 2024
- Advertisement -

భారీ స్కోరు..ఇలా కొట్టేశారంతే!

- Advertisement -

ఐపీఎల్ 2024..రికార్డులకు వేదికగా మారుతోంది. ప్రతి మ్యాచ్లో 200 స్కోరు దాటుతుండటంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా కోల్ కతా వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన పోరులో సిక్సర్ల వర్షంతో ఈడెన్ గార్డెన్ తడిసిముద్దైంది. కోల్ కతా విధించిన 262 పరుగుల భారీ టార్గెట్‌ని చేధించి కన్నుల విందు చేసింది పంజాబ్.

ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా శశాంక్ సింగ్ తానేమి తక్కువ కాదని సిక్సర్ల వర్షం కురిపించారు. బెయిర్ స్టో 48 బంతుల్లో 9 సిక్స్‌లు,8 ఫోర్లతో 108 పరుగులు చేయగా శశాంక్ సింగ్ 28 బంతుల్లో 8 సిక్స్‌లు, ఫోర్లతో 68 పరుగులు చేశారు. ప్రభుమాన్‌ సింగ్ సైతం 20 బంతుల్లో 5 సిక్స్‌లు,4 ఫోర్లతో 54 పరుగులు చేయడంతో ఢిల్లీ ఏ దశలోనూ ఓడిపోతుందనిపించలేదు.

అంతకుముందు తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (75), సునీల్ నరైన్ (71) ,వెంకటేష్ అయ్యర్ (39), ఆండ్రీ రెస్సెల్ (24), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (28) పరుగులు చేయడంతో భారీ స్కోరు సాధించింది. పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ టాప్ 2లో కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -