Thursday, May 9, 2024
- Advertisement -

జగన్‌ మేనిఫెస్టో..ప్రజల సంబరాలు

- Advertisement -

అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏమి లాభం… కదలని చెక్క గుర్రం ఎంత బావుంటే ఏమి లాభం…. పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటె ఏమి లాభం… అలాగే అమలు చేయని మ్యానిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటె ఏమి లాభం… అందుకే చెప్పేదే చేస్తాం… చేసేదే చెబుతాం …. విశ్వసనీయతే మా ప్రాణం…

ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆకాశాన్నంటే హామీలు లేవు…ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తాం అనే బొంకులు లేవు..ఊరూవాడా పందిరివేస్తాం… రోజూ మీకు విందుభోజనాలు పెడతాం అనే మాయలు లేవు… రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ…ఎక్కడెక్కడ ,,ఏఏవర్గాలకు ఏయే విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడా అలా చేస్తూ వెళతాం అంటూ హామీ ఇచ్చారు.. అమ్మఒడి .. రైతుభరోసా వంటివి ఆయావర్గాలకు మేలు చేస్తాయి. ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు… అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం, తరువాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు.

ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు… ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి… చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు.. మాటలు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. జగన్ అన్న ఉంటే చాలు… ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -