Saturday, May 4, 2024
- Advertisement -

నవదీప్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. ఎన్టీఆర్ ఏం చెప్పారు..?

- Advertisement -

తెలుగు లో బిగ్ బాస్ షో మంచి జోష్ మీద సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ షో.. చూస్తున్న వీక్షకుల సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. ఆదివారం నాడు బిగ్ బాస్ తెలుగు నుంచి కల్పన ఎలిమినేట్ అయ్యారు.

అయితే ఆమె ఎలిమినేట్ కావడానికి కారణాలు.. అలానే బిగ్ బాస్ హౌసులో తన అనుభవాలను చాలా బాగా చెప్పింది. అంతే కాకుండా.. బిగ్ బాస్ లో ఉండే వారి గురించి పాట రూపంలో పాడి చెప్పింది. ఆమె చెప్పే ప్రతి మాటకు ఎన్టీఆర్ నవ్వుతునే ఉన్నారు. ఆ రెంజ్ లో కల్పన అందరిని నవ్వించింది. అయితే ఒకరు ఎలిమినేట్ అయితే మరొకరు వైల్డ్ కార్డు ద్వారా లోపలికి ఎంట్రీ కావాలి కదా.. ఇందులో భాగంగా హీరో నవదీప్ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు.

నవదీప్‌ను పరిచయం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్… చిన్నా నవదీప్… బయట ఏం జరిగిందో బిగ్ బాస్ హౌసులో వున్నవారికి ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఏం జరిగిందో నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు. బయట ఏం జరిగిందో మనకు తెలిసిందే. డ్రగ్స్ కేసులో నవదీప్ ను సిట్ అధికారులు విచారించారు. ఈ విషయం గురించి అసలు మాట్లడకుడదు. మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్న నువ్వు ఎలా వైల్డుగా ముందుకు వెళతావో చూస్తాం.. అని ఎన్టీఆర్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -