Tuesday, May 6, 2025
- Advertisement -

ఇద్ద‌రు హీరోయిన్‌ల‌ను లైన్లో పెట్టిన క‌ల్యాణ్ రాం

- Advertisement -

హీరో క‌ల్యాణ్ రాం చాలాకాలంగా హిట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడు.చేసిన సినిమాలు బాక్సాఫిస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో తీవ్ర నిరాశ‌లో ఉన్నాడు.మొన్న ఈ మ‌ధ్య వ‌చ్చిన ఎమ్మెల్యే సినిమా యావ‌రేజ్‌గా ఆడింది.క‌ల్యాణ్ రాం లాస్ట్ హిట్ ప‌టాస్‌.ఆ సినిమా త‌రువాత మ‌నోడికి మ‌రో హిట్ లేదు.ప్ర‌స్తుతం క‌ల్యాణ్ రాం ‘నా నువ్వే’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి కల్యాణ్ రామ్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా తమన్నా నటిస్తోంది.

ఈ సినిమా చేస్తూనే కల్యాణ్ రామ్ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు.ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచియం చేస్తు ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా కోసం కథానాయికలుగా నివేదా థామస్ ను .. షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారు. ఈ ఇద్దరు కథానాయికలకి కూడా తెలుగులో ఒక రేంజ్ లో క్రేజ్ ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -