Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఇంట్లో క‌ల్యాణ్ రామ్ పుట్టిన రోజు వేడుక‌లు

- Advertisement -

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ పుట్టిన రోజు(గురువారం) వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.కళ్యాణ్ రామ్ నిన్న‌టి పుట్టిన రోజుతో 40ఏళ్లు పూర్తి చేసుకున్నారు.అయితే క‌ల్యాణ్ రామ్ త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను త‌మ్ముడు ఎన్టీఆర్ ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకున్నాడు.దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.అన్నయ్యతో కేక్ కట్ చేయించి తినిపించాడు ఎన్టీఆర్‌.

బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ కూడా ఉన్నాడు.కళ్యాణ్ రామ్ తాజాగా తన 16వ సినిమాను కేవీ గుహాన్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆరవింద సమేత చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -