Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్రబాబు లేడు..లోకేష్ వల్ల అవుతుందా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనే కాదు పార్టీలో అసంతృప్తులను బుజ్జగించడంలో ఆయన స్టైలే వేరు. అందుకే ఎంతమంది సీనియర్లు పార్టీని వీడినా టీడీపీని కాపాడుకుంది బాబే. అయితే ప్రస్తుతం బాబు రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉండగా భారం అంతా లోకేష్‌పై పడింది. లోకేష్ అనుభవారాహిత్యం, మాటలు కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి.

ఇక చంద్రబాబు బయటకు ఎప్పుడు వస్తారో తెలియని సిచ్యువేషన్ ఉండగా లోకేష్ ఒక్కడే పార్టీని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ వైపు జనసేన పొత్తు మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే పని వెరసీ ఇది లోకేష్ కెరీర్‌లోనే టఫెస్ట్ కండీషన్.

జనసేనతో సీట్ల పొత్తు తర్వాత వచ్చే అసంతృప్తిని పక్కన పెడితే టీడీపీలోనే దాదాపు 40కి పైగా నియోజకవర్గాల్లో నేతలు ఆ పార్టీ నేతలపైనే రగిలిపోతున్నారు.
ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం, తూర్పులోని తుని మాజీ మంత్రి య‌న‌మ‌ల కుటుంబానికే టికెట్ ఇస్తుండ‌డం, వారు ఓడిపోతుండ‌డంపై కొత్తవారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల స్థానాలు, ఉమ్మ‌డి కృష్ణాలోని గుడివాడ‌, నూజివీడు, పెడ‌న‌, గ‌న్న‌వ‌రం వైసీపీ నుంచి వ‌చ్చిన యార్ల‌గ‌డ్డ‌కు టికెట్ ప్ర‌క‌టించ‌డంపై త‌మ్ముళ్లు ర‌గులుతు న్నారు. క‌దిరి, అనంత‌పురం అర్బ‌న్‌, పుట్ట‌ప‌ర్తి, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్ర‌త్తిపాడు, తాడికొండ‌, శ్రీకాకుళంలోని శ్రీకాకుళం, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని న‌ర‌సాపురం, ఉండి, భీమ‌వ‌రం వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో అసంతృప్తి చాలాఉంది. మొత్తంగా రానున్న రోజుల్లో ఈ వ్యవహారం అంతా లోకేష్‌కు తలనొప్పిగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -