Monday, May 13, 2024
- Advertisement -

గాయ‌ప‌డిన ఎమ్మెల్యే

- Advertisement -

షూటింగ్‌లో గాయ‌ప‌డిన క‌ల్యాణ్‌రామ్‌

ఈసారైనా మంచి సినిమాతో రావాల‌ని నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా తాను న‌టిస్తున్న ఎమ్మెల్యే (మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి) షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. జయేంద్ర దర్శకత్వంలో వ‌స్తున్న సినిమా షూటింగ్ వికారాబాద్‌లో జ‌రుగుతోంది. అయితే ఈ షూటింగ్‌లో క‌ల్యాణ్‌రామ్ గాయ‌ప‌డ్డాడు. ఈ సినిమాను నిర్మిస్తున్న మహేశ్‌ కోనేరు ట్విటర్‌ ద్వారా తెలిపారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌ ప్రస్తుతం తన 15వ సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. గురువారం ఈ సినిమా షూటింగ్‌ వికారాబాద్ రైల్వేస్టేష‌న్ ప‌రిస‌రాల్లో జ‌రిగింది. వికారాబాద్ అట‌వీ ప్రాంతంలో ఈ సినిమా శుక్ర‌వారం కూడా తీశారు. అయితే ఈ షూటింగ్‌లో కల్యాణ్‌రామ్‌కు గాయమైందట. కల్యాణ్‌రామ్‌ గాయపడినప్పటికీ షూటింగ్‌కు విరామం చెప్పకుండా సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు స‌మాచారం. పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని శుక్రవారం షూటింగ్‌లో పాల్గొన్నారు. వృత్తిపట్ల ఆయనకి ఉన్న అంకితభావానికి హాట్సాఫ్ అని మ‌హేశ్ కోనేరు ట్విట‌ర్‌లో చెప్పారు.

కల్యాణ్‌రామ్ చివ‌రి సినిమా ఇజం నిరాశ‌ప‌రిచింది. త‌న త‌మ్ముడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ సినిమా నిర్మించా మంచి విజ‌యం అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయ‌న ‘ఎం.ఎల్‌.ఎ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలో నటిస్తున్నాడు. ఉపేంద్ర మాధ‌వ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేశ్ కోనేరు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి నిర్మాతలు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -